IND vs SL 1st Test : లంకేయుల‌తో టీమిండియా రెడీ

మొహాలీలో మొద‌టి టెస్టు మ్యాచ్

IND vs SL 1st Test : భార‌త క్రికెట్ జ‌ట్టు ఫుల్ జోష్ మీద ఉంది. ఇప్ప‌టికే స్వ‌దేశంలో వెస్టిండీస్ తో పాటు శ్రీ‌లంక జ‌ట్టును టీ20, వ‌న్డే మ్యాచ్ లు స్వీప్ చేసింది. ప్ర‌స్తుతం మొహాలీ వేదిక‌గా భార‌త – శ్రీ‌లంక జ‌ట్ల మ‌ధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది.

అనుకోని రీతిలో మ‌రోసారి గాయ‌ప‌డ్డాడు కేఎల్ రాహుల్. ఇక టీమిండియాకు ఎన‌లేని విజ‌యాలు అందించిన చ‌తేశ్వ‌ర్ పుజారా, అజింక్యా ర‌హానేల‌పై వేటు ప‌డింది.

టెస్టు మ్యాచ్ కు సిద్ద‌మైంది భార‌త జ‌ట్టు. భార‌త జ‌ట్టు(IND vs SL 1st Test) మాజీ క్రికెట‌ర్ ఆకాష్ చోప్రా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ మేర‌కు త‌న టీంను కూడా ప్ర‌క‌టించాడు.

కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, మ‌యాంక్ అగ‌ర్వాల్ ఓపెన‌ర్లుగా శ్రేయాస్ అయ్యార్, విరాట్ కోహ్లీ మూడు, నాలుగు స్థానాల్లో వ‌స్తార‌ని అంచ‌నా వేశాడు.

త‌న టీంలో ఆరో స్థానంలో రిష‌బ్ పంత్ , ఆల్ రౌండ‌ర్ల కోటాలో ర‌వీంద్ర జ‌డేజాను ఎంచుకున్నాడు. స్పిన్న‌ర్ గా అశ్విన్ చోటు ద‌క్కింది. ఇక సీమ‌ర్ల కోటాలో బుమ్రా, ష‌మీ, సిరాజ్ ల‌కు స్థానం క‌ల్పించాడు.

విచిత్రం ఏమిటంటే శుభ‌మ‌న్ గిల్ కు ఎలాంటి చోటు ద‌క్క‌క పోవ‌డం విశేషం. త‌న జ‌ట్టులో రోహిత్, మ‌యాంక్ , అయ్య‌ర్, కోహ్లీ, విహారి, పంత్ , జ‌డేజా, అశ్విన్ , ష‌మీ, సిరాజ్ , బుమ్రా ఉన్నారు.

శ్రీ‌లంక టీ20 సీరీస్ కోల్పోయింది. ప్ర‌స్తుతం మొద‌టి టెస్టు ఆడేందుకు రెడీ అయ్యింది. మూడు ఫార్మాట్ ల‌లో భార‌త జ‌ట్టు అత్యంత బ‌లంగా ఉంది. బ్యాటింగ్..బౌలింగ్ లోనూ స‌త్తా చాటుతోంది. పేస‌ర్ బౌలింగ్ లో కూడా టాప్ లో ఉంది.

Leave A Reply

Your Email Id will not be published!