Tech Mahindra CEO : ఏఐ సిఇఓకు మ‌హీంద్రా సిఇఓ స‌వాల్

భార‌తీయ కంపెనీలు పోటీ ప‌డ‌లేవు

Tech Mahindra CEO : టెక్ మ‌హీంద్రా సిఇఓ సీపీ గుర్నావీ(CP Gurnani) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. భార‌తీయ కంపెనీలు సిలీకాన్ వ్యాలీ కంపెనీల‌తో పోటీ ప‌డ లేవంటూ ఓపెన్ ఏఐ సిఇఓ ఆల్ట్ మాన్ భార‌త ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీనిపై తీవ్ర స్థాయిలో నిర‌స‌న వ్య‌క్త‌మైంది. ప్ర‌స్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న అన్ని రంగాల‌కు చెందిన కంపెనీల‌ను నిర్వ‌హిస్తున్న‌ది భార‌తీయులేన‌న్న సంగ‌తి మ‌రిచి పోతే ఎలా అని ప్ర‌శ్నించారు గుర్నావీ(CP Gurnani).

తాను ఆల్ట్ మాన్ చేసిన స‌వాల్ ను స్వీక‌రిస్తున్నాన‌ని అన్నారు. ద‌మ్ముంటే సిలీకాన్ వ్యాలీ కంపెనీలేవో త‌మ వ‌ద్ద‌కు రావ‌చ్చ‌ని, ఎవ‌రి సామ‌ర్థ్యం , స‌త్తా ఏమిటో తేల్చుకుందామ‌ని ఛాలెంజ్ విసిరారు.

ఇదిలా ఉండ‌గా త‌న టూర్ లో భాగంగా ఆల్ట్ మాన్ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఆ త‌ర్వాత ఐఐఐటీ స‌ద‌స్సులో ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చారు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌మ దేశానికి చెందిన ఐటీ కంపెనీల‌తో మీ కంపెనీలు పోటీ ప‌డ‌లేవంటూ ఎద్దేవా చేశారు ఆల్ట్ మ‌న్.

దీనిపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు గుర్నావీ. య‌స్..తాము ఎవ‌రితోనైనా పోటీ ప‌డేందుకు సిద్దంగా ఉన్నామంటూ ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం గుర్నావీ చేసిన ఛాలెంజ్ ఆస‌క్తిక‌రంగా మారింది. నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. ఏది ఏమైనా ఆరోగ్య‌క‌ర‌మైన పోటీ ఉండాలే త‌ప్పా ఇలా కించ ప‌రిచేలా ఉండ కూడ‌ద‌న్న‌ది నిపుణుల సూచ‌న‌.

Also Read : DK Shiva Kumar : మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో ట్ర‌బుల్ షూట‌ర్

Leave A Reply

Your Email Id will not be published!