Google CEO Modi : భారత్ లో సాంకేతిక పురోగతి సూపర్
మోదీని ప్రశంసించిను గూగుల్ సిఇఓ
Google CEO Modi : ప్రముఖ దిగ్గజ ఐటీ కంపెనీ సిఇఓ సుందర్ పిచాయ్ భారత్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన భారత దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీతో(Google CEO Modi) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చాలా సేపు వివిధ అంశాలపై చర్చించారు.
భారత దేశం అత్యంత ప్రతిష్టాత్మకమైన జీ20 గ్రూప్ కు అధ్యక్షత వహించడం గర్వంగా ఉందన్నారు. ఈ మేరకు తమ సంస్థ పరంగా ఎలాంటి మద్దతు ఇచ్చేందుకైనా తాము సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు సుందర్ పిచాయ్. గతంలో కంటే ప్రస్తుతం సాంకేతిక పురోగతి పెరిగందన్నారు.
వేగంగా అభివృద్ది చెందడం స్పూర్తి దాయకమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న ప్రయత్నం గొప్పదన్నారు. మోదీతో భేటీ సందర్భంగా తన అనుభవాన్ని పంచుకున్నారు సుందర్ పిచాయ్. ఇవాళ జరిగిన గొప్ప సమావేశానికి ధన్యవాదాలు. మోదీజీ..మీ నాయకత్వంలో సాకేంతిక మార్పు, వేగ వంతమైన వేగాన్ని చూసేందుకు స్పూర్తిని కలిగిస్తోందని పేర్కొన్నారు.
తమ బలమైన భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకు , అందరికీ పని చేసే ఓపెన్ , కనెక్ట్ చేసిన ఇంటర్నెట్ ను ముందుకు తీసుకు వెళ్లేందుకు గాను భారత్ కు సంబంధించిన జీ20 నాయకత్వానికి మద్దతు ఇవ్వాలని చూస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి సంబంధించి డిజిటల్ ఇండియా చొరవను ఈ సందర్భంగా ప్రశంసించారు గూగుల్ సిఇఓ.
భారత దేశంలో ఊహించని రీతిలో వేగవంతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఇది తనను మరింత సంతోషానికి గురి చేసిందని పేర్కొన్నారు గూగుల్ సిఇఓ.
Also Read : ఎలాన్ మస్క్ పోల్ నెట్టింట్లో వైరల్