Teenmar Mallanna : మేడ్చల్ నుంచి పోటీ చేస్తా – మల్లన్న
జైలు నుంచి తీన్మార్ విడుదల
Teenmar Mallanna : జైలు నుంచి విడుదలైన తీన్మార్ మల్లన్న సంచలన ప్రకటన చేశారు. త్వరలో తెలంగాణలో కొత్త పార్టీ పెడతానని వెల్లడించారు. త్వరలోనే పార్టీ పేరు, వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. భారీ ఎత్తున జనం ఆయనకు స్వాగతం పలికారు. చర్లపల్లి జైలు నుంచి ఇవాళ విడుదలయ్యారు. తన పార్టీ పేరు తెలంగాణ నిర్మాణ పార్టీగా ఉండబోతోందని స్పష్టం చేశారు.
భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. మల్లన్న(Teenmar Mallanna) తరపున ప్రముఖ లాయర్ శరత్ కుమార్ వాదించారు. తీన్మార్ మల్లన్నపై పలు కేసులు నమోదయ్యాయి. చివరకు పీడీ యాక్టు నమోదు చేయాలని చూశారని లాయర్ వెల్లడించారు. తనపై ఎన్ని కేసులు నమోదు చేసినా తాను భయపడనని ప్రకటించారు. మల్లన్నతో పాటు ఇతర సిబ్బందికి కూడా బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఈ మొత్తం ర్యాలీని పోలీసులు వీడియో తీశారు.
తీన్మార్ మల్లన్న సంచలన ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్ పోలీసులను నమ్ముకున్నాడని, సెక్షన్లతో ఇబ్బంది పెట్టడం అలవాటుగా మార్చుకున్నాడని ఆరోపించారు. కానీ తాను వీకర్ సెక్షన్లను నమ్ముకున్నట్లు చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు తీన్మార్ మల్లన్న.
Also Read : నిరంజన్ రెడ్డి నిర్వాకం కబ్జాల పర్వం