PM Modi : తేజ‌స్ జెట్ ఆత్మ నిర్భ‌ర్ కు ద‌ర్ప‌ణం

ప్ర‌శంసించిన ప్ర‌ధాన‌మంత్రి మోదీ

PM Modi : ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ దిశ‌గా చేస్తున్న ప్ర‌య‌త్నాలు స‌త్ ఫ‌లితాలు ఇస్తున్నాయ‌ని అన్నారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. ఐఎన్ఎస్ విక్రాంత్ లో తేజ‌స్ జెట్ ల్యాండింగ్ పై అద్భుతం అని పేర్కొన్నారు. పూర్తి శ‌క్తితో కొన‌సాగుతుంద‌న్న ఆశాభావం వ్య‌క్తం చేశారుప్ర‌ధాన‌మంత్రి. నేవీ వైస్ చీఫ్ వైస్ అడ్మిర‌ల్ ఎస్ఎన్ ఘోర్ మాడే మేక్ ఇన్ ఇండియాకి ఇది అతి పెద్ద విజ‌యంగా అభివ‌ర్ణించారు.

విమాన వాహ‌న‌నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ లో స్వ‌దేశీ ఎల్సీఏ (నేవీ) , ఎంఐజీ 29 కే జెట్ లు చారిత్రాత్మ‌కంగా ల్యాండింగ్ చేయ‌డాన్ని ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌శంసించారు. మేడ్ ఇన్ ఇండియా ఆయుధ వ్య‌వ‌స్థ‌ల కోసం భార‌త నావికా ద‌ళం దేశీయ మొట్ట మొద‌టి స్వదేశీ విమాన వాహ‌న నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ లో స్వ‌దేశీ ఎల్సీఏ , ఎంఐజీ29 కె జెట్ ల‌ను తొలిసారిగా ల్యాండింగ్ చేసింది.

స్వ‌దేశీ ఫైట‌ర్ ఎయిర్ క్రాఫ్ట్ తో స్వ‌దేశీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియ‌ర్ ను రూపొందించ‌డం , అభివృద్ది చేయ‌డం , నిర్మించ‌డం , ఆప‌రేట్ చేయ‌డంలో భార‌త దేశం సామ‌ర్థ్యాన్ని కూడా ఇది ప్ర‌ద‌ర్శిస్తుంద‌న్నారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi). ఈ స‌క్సెస్ మ‌రిన్ని ఆవిష్క‌ర‌ణ‌ల‌కు ఊతం ఇస్తుంద‌ని పేర్కొన్నారు. అంతే కాదు రక్ష‌ణ రంగంలో అతి పెద్ద విజ‌యంగా తెలిపారు.

భార‌త దేశానికి స్వేచ్ఛ ల‌భించి 75 ఏళ్లు అవుతోంది. ఇందుకు సంబంధించి అమృత్ మ‌హోత్స‌వ్ ను నిర్వ‌హిస్తోంది కేంద్రం. మొట్ట మొద‌టి స్వ‌దేశీ విమాన వాహ‌న నౌక‌ను ప్రారంభించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ.

Also Read : బింగ్ షాక్ ఇవ్వ‌డం ఖాయం – సిఇఓ

Leave A Reply

Your Email Id will not be published!