Tejashwi Yadav : దమ్ముంటే ఈడీ నా ఇంటికి రావచ్చు
తేజస్వి యాదవ్ సంచలన కామెంట్స్
Tejashwi Yadav : బీహార్ డిప్యూటీ సీఎంగా కొలువు తీరిన ఆర్ఎల్డీ అగ్ర నాయకుడు తేజస్వి యాదవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బీజేపీతో తెగ తెంపులు చేసుకున్న జేడీయూ చీఫ్,
సీఎం నితీశ్ కుమార్ తో ఆయన జత కట్టారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గతంలో ప్రతిపక్షంగా ఉన్న సమయంలో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటం చేశారు.
ఓ వైపు తన తండ్రి మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ అనారోగ్యంతో ఉన్నప్పటికీ నిత్యం ఆందోళన చేపట్టారు. ప్రధానంగా నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, జాబ్స్ భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనూ తేజస్వి యాదవ్ తన ప్రధాన ఎజెండా ఏమిటో స్పష్టం చేశారు. కేవలం ఒకే ఒక్క నెలలో భారీ ఎత్తున ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించారు.
ఇందుకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. శుక్రవారం తేజస్వి యాదవ్(Tejashwi Yadav) జాతీయ మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
దమ్ముంటే కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని తన వద్దకు రావాలని సవాల్ విసిరారు. మా స్థలంలో తమ ఆఫీసు కూడా ప్రారంభించవచ్చని ఎద్దేవా చేశారు.
ఈడీ గురించి మీకు ఆందోళన లేదా అన్న ప్రశ్నకు పై విధంగా జవాబు ఇచ్చారు. ప్రతిపక్షాలను బీజేపీ సర్కార్ టార్గెట్ చేస్తోంది. అది ఎంతో కాలం సాగదన్నారు.
ప్రతి దానికి కొంత సమయం అంటూ ఉంటుందని, దాని కోసం వేచి చూస్తామన్నారు తేజస్వి యాదవ్.
Also Read : బెంగాల్ ఐపీఎస్ ఆఫీసర్లకు ఈడీ సమన్లు