Tejashwi Yadav: బిహార్‌ ఓటర్ల జాబితాలో నా ఓటు లేదు – తేజస్వీ యాదవ్‌

బిహార్‌ ఓటర్ల జాబితాలో నా ఓటు లేదు - తేజస్వీ యాదవ్‌

Tejashwi Yadav : కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) విడుదల చేసిన బిహార్‌ ఓటర్ల జాబితా ముసాయిదాలో తన పేరు లేదని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ ఆరోపించారు. పట్నాలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో తేజస్వీ (Tejashwi Yadav) మాట్లాడుతూ… ‘‘నా ఓటరు ఫోటో గుర్తింపు కార్డు (ఎపిక్‌) నంబరుతో ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో తనిఖీ చేశాను. దానిలో నా పేరు కనిపించలేదు. ఇక నేను ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలి ? స్వయంగా బూత్‌ స్థాయి అధికారి (బీఎల్‌ఓ) నా వద్దకు వచ్చి దరఖాస్తు స్వీకరించారు. అయినా నా పేరు ఓటరు జాబితాలో లేదు’’ అని తేజస్వి వెల్లడించారు.

ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్‌ఐఆర్‌)తో రాష్ట్రంలో దాదాపు 65 లక్షల ఓటర్ల పేర్లను తొలగించారని పేర్కొన్నారు. ఆరోపణలపై ఈసీ స్పందిస్తూ- ముసాయిదా జాబితాలో 416 క్రమసంఖ్య వద్ద తేజస్వి పేరు ఉందని స్పష్టంచేసింది. ఈ ఆరోపణలు నిరాధారమని పేర్కొంది. ఆయన చెబుతున్న కార్డు ఫోర్జరీదా అనేది దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది.

Tejashwi Yadav – ‘ఆ ఓటరు కార్డు అప్పగించండి’ – తేజస్వీకి ఈసీ నోటీసులు

బిహార్‌ ఓటర్ల జాబితా ముసాయిదాలో తన పేరు లేదని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ (Tejashwi Yadav) ఆరోపించడంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఆ కార్డు అధికారికంగా జారీ చేసింది కాదని, సమగ్ర దర్యాప్తు జరిపేందుకు దానిని అప్పగించాలంటూ నోటీసులు జారీ చేసింది. ‘‘ఆగస్టు 2న పట్నాలో విలేకరుల సమావేశంలో తేజస్వీ చూపించిన గుర్తింపు కార్డు అధికారికంగా జారీ చేసింది కాదు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేసేందుకు ఆ కార్డును అప్పగించాలని కోరుతున్నాం’’ అని పేర్కొంటూ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌కు ఎన్నికల సంఘం అధికారులు లేఖ రాశారు. మరోవైపు తన ఓటరు కార్డు నంబరు మార్చారని తేజస్వీ చేసిన వాదనను జిల్లా కలెక్టర్‌ తిరస్కరించారు. 2020 అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్న ఓటరు గుర్తింపు నంబరు కూడా ఇదేనన్నారు.

మరోవైపు ఓటరు గుర్తింపు కార్డుపై తేజస్వీ యాదవ్‌ (Tejashwi Yadav) చేసిన ఆరోపణలపై బిహార్‌లోని ఎన్డీయే కూటమి పక్షాలు మండిపడ్డాయి. రెండు కార్డులు కలిగి ఉండటం చట్టవిరుద్ధమని, అందుకు ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశాయి. రాహుల్‌ గాంధీ చెప్పిన ‘‘ఆటమ్‌ బాంబు’ ఇదేనా అని విమర్శలు గుప్పించాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష కూటమి ఓటమి చవిచూస్తుందని, ఇటీవల ఈసీ చేపట్టిన ఎస్‌ఐఆర్‌ను అందుకు సాకుగా చూపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది.

ఇటీవల ఈసీ ప్రకటించిన ప్రత్యేక సమగ్ర సవరణ జాబితాలో తన గుర్తింపు కార్డు నంబరు కనిపించలేదని, రాష్ట్రంలో 65 లక్షల ఓటర్ల పేర్లను తొలగించారని తేజస్వీ యాదవ్‌ ఆరోపించారు. దీనిపై స్పందించిన ఈసీ… అవి నిరాధారమని స్పష్టం చేసింది. ముసాయిదా జాబితాలో 416 క్రమ సంఖ్య వద్ద తేజస్వి పేరు ఉందని, ఆయన చెప్పిన కార్డు ఫోర్జరీ చేశారా? అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది. ఈ క్రమంలోనే ఆ కార్డును తమకు అప్పగించాలంటూ లేఖ రాసింది.

Also Read : Sadhvi Pragya Thakur: మాలేగావ్‌ పేలుళ్లు కాంగ్రెస్‌ కుట్ర – మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌

Leave A Reply

Your Email Id will not be published!