Tejashwi Yadav: నడి రోడ్డుపై బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ డ్యాన్స్
నడి రోడ్డుపై బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ డ్యాన్స్
Tejashwi Yadav : బీహర్‌లో ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికల్లో సత్తా చాటేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఇదే సమయంలో బీహార్‌లో ప్రతిపక్షాలు ‘ఓటరు అధికార్ యాత్ర’ను చేపట్టాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు బీహార్ కు చెందిన ఆర్జేడీ, ఇండియా కూటమి పార్టీల నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అయితే ఈ యాత్ర ముగియగానే ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్ చిల్ అయినట్లు ఉన్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. రాహుల్ ‘ఓటరు అధికార్ యాత్ర’లో పాల్గొన్న రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) నేత, బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) యాత్ర ముగియగానే చిల్ అవుతూ కనిపించారు.
Tejashwi Yadav Dance
పట్నాలోని మెరైన్ డ్రైవ్ ఎక్స్‌ప్రెస్‌వే వద్ద పలువురు యువకులతో పాటు తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) నృత్యం చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోను అతని సోదరి రోహిణి ఆచార్య సోషల్ మీడియాలో షేర్ చేశారు. సింగపూర్ నుండి వచ్చిన తన మేనల్లుడితో కలిసి తేజస్వి యాదవ్ మెరైన్ డ్రైవ్‌లో డ్రైవ్ చేశారు. అనంతరం అక్కడ సోషల్ మీడియా కోసం రీల్స్ చేస్తున్న యువ కళాకారుల బృందాన్ని తేజస్వి చూశారు. వారి మధ్యకు చేరి ఉత్సాహంగా నృత్యం చేశారు. వారి నుంచి ట్రెండింగ్ డ్యాన్స్ మూవ్‌లను నేర్చుకున్నారు. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ సిగ్నేచర్ స్టెప్‌లను కూడా తేజస్వి అనుకరించారు.
ఒక క్లిప్‌లో తేజస్వి ఆయన తన తండ్రి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను గుర్తుచేసే భోజ్‌పురి పాట ‘లాలు బినా చాలు ఈ బీహార్ న హోయి’కి నృత్యం చేశారు. మరో వీడియోలో ఆయన పోలీసు అధికారులతో సంభాషించడం, యువ కళాకారులతో రోడ్డు పక్కన టీ తాగడం లాంటి దృశ్యాలు ఉన్నాయి. కాగా ఓటరు అధికార్ యాత్ర ఆగస్టు 17 నుండి సెప్టెంబర్ 1 వరకు బీహార్‌లో 16 రోజుల పాటు జరిగింది. దీనికి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ నాయకత్వం వహించారు.
Also Read : Punjab: భారీ వర్షాలకు భూమిలో కూరుకుపోయిన 60 బైకులు
