Tejashwi Yadav : బీహార్ పరువు తీస్తున్న కేంద్రం – తేజస్వి
ప్రభుత్వం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది
Tejashwi Yadav : కల్తీ మద్యం కారణంగా చనిపోయిన ఘటనకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్. కావాలని కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ సర్కార్ బీహార్ పరువు తీస్తున్నారంటూ ఆరోపించారు. ఇప్పటికే తమ సీఎం నితీశ్ కుమార్ కీలక ప్రకటన చేశారని తెలిపారు.
కల్తీ మద్యం తాగవద్దని స్పష్టం చేశారని తెలిపారు. అయినా కావాలని తాగే వాళ్లను తాము ఏమీ చేయలేమంటూ పేర్కొన్నారు తేజస్వి యాదవ్. ఇదిలా ఉండగా హూచ్ ఘటనపై విచారణ చేపట్టేందుకు జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్ సీ ) బృందం బీహార్ లోని పాట్నాకు చేరుకుంది.
హక్కుల సంఘం పేరుతో తమ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తోందంటూ ఆరోపించారు తేజస్వి యాదవ్(Tejashwi Yadav). కాగా సరన్ జిల్లాలో విష పూరితమైన మద్యం సేవించి 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇదంతా కావాలని చేస్తున్న ప్రయత్నంగా కొట్టి పారేశారు. పార్లమెంట్ లో ఎన్సీఆర్బీ నివేదిక సమర్పించారని ఆరోపించారు.
అయితే మధ్యప్రదేశ్ , హర్యానా రాష్ట్రాలలో ఇదే హక్కుల సంస్థ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ఒక రకంగా తేజస్వి యాదవ్ నిలదీశారు. నాలుగు నెలల కిందట భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీరు ఎక్కడ ఉన్నారంటూ మండిపడ్డారు.
అయితే వచ్చిన జాతీయ హక్కుల కమిషన్ లో తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు. కల్తీ మద్యం కారణంగా ప్రాణాలు కోల్పోవడంతో బాధిత కుటుంబాలు ప్రభుత్వంపై మండి పడుతున్నారు. ఎవరు ఏమిటనేది జనానికి తెలుసన్నారు.
Also Read : లిక్కర్ స్కాంలో కవితకు 32 శాతం వాటా