BJP Conditions : సోషల్ మీడియా ఆధారంగా ఎంపిక
అభ్యర్థులకు బీజేపీ కండీషన్స్
BJP Conditions : తెలంగాణలో త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి పార్టీ చీఫ్ , సీఎం కేసీఆర్(KCR) సంచలన ప్రకటన చేశారు. 119 సీట్లకు గాను 115 సీట్లకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేశారు. వీరిలో ఎక్కువ మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి ఛాన్స్ ఇచ్చారు. ఇదే సమయంలో 7 గురికి స్థాన చలనం కలిగింది. దీంతో బీఆర్ఎస్ దెబ్బకు కాంగ్రెస్, బీజేపీలపై ఒత్తిడి పెరిగింది.
BJP Conditions Viral
ఆయా నియోజకవర్గాలకు సంబంధించి కాంగ్రెస్ ఫీజులు నిర్ణయించింది. ఓసీలకు రూ. 50 వేలు , బీసీలకు రూ.25 వేలు చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. సర్వేల ఆధారంగా ఎంపిక చేస్తామని , అదంతా హై కమాండ్ చూసుకుంటుందని స్పష్టం చేశారు టీపీసీసీ చీఫ్.
ఇది పక్కన పెడితే పవర్ లోకి రావాలని ప్లాన్ చేస్తున్న బీజేపీకి ఊహించని రీతిలో భారీగా దరఖాస్తులు అందాయి. దీంతో వీరిని ఎంపిక చేయడం తలకు మించిన భారంగా మారింది నూతన అధ్యక్షుడైన కిషన్ రెడ్డికి.
ఎంపిక చేయాలంటే కొన్ని కండీషన్స్ పెట్టారు. సోషల్ మీడియాలో 25 వేల మంది ఫాలోవర్లు ఉండాలని, ఇది అసెంబ్లీ టికెట్ రావాలంటే ..ఇక లోక్ సభ టికెట్ పొందాలంటే కనీసం 10 వేల మంది ఫాలోవర్లు ఉంటేనే ఇస్తామని ప్రకటించారు. విచిత్రం ఏమిటంటే బీజేపీ చీఫ్ కు ఎంత మంది ఫాలోవర్లు ఉన్నారో చెప్పాలంటూ ఓ నెటిజన్ ప్రశ్నించడం విశేషం.
Also Read : AP Assembly : మీసం తిప్పిన బాలయ్య అంబటి వార్నింగ్
