Telangana Cabinet : వరాల జల్లు జేబులకు చిల్లు
ఖాళీ జాగా ఉంటే రూ. 3 లక్షలు
Telangana Cabinet : ముందస్తు ఎన్నికలకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్లు అనిపిస్తోంది బీఆర్ఎస్ సర్కార్. కేబినెట్(Telangana Cabinet) కీలక సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా వరాల జల్లులు కురిపించింది. ఖాళీ జాగా ఉండి ఇల్లు కట్టుకోవాలని అనుకునే వారికి రూ. 3 లక్షలు ఇస్తామని తెలిపింది. స్వంత స్థలం ఉంటే తామే ఇల్లు కట్టిస్తామని పేర్కొన్నారు. అంతే కాకుండా గృహ లక్ష్మి పథకం కింద 4 లక్షల మందికి ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు.
ఇక రెండో విడత ద్వారా లక్షా 30 వేల ఫ్యామిలీస్ కు దళితబంధు ఇస్తామన్నారు. ప్రతి ఏటా ఆగస్టు 15న ఇందుకు సంబంధించి ఘనంగా వేడుకలు చేపడతామని తెలిపారు. ఒక్కో నియోజకవర్గానికి 1100 మందిని ఎంపిక చేస్తామని వెల్లడించారు. ఇక గృహ లక్ష్మి కింద నియోజకవర్గంలో 3 వేల చొప్పున ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఇందుకు సంబంధించి లబ్దిదారుల ఎంపిక ప్రారంభం అవుతుందన్నారు. రూ. 3 లక్షలు గ్రాంట్ గా ఇస్తామని తెలిపారు.
ఈ పథకానికి రూ. 12 వేల కోట్ల నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. ఈ ఇళ్లన్నీ మహిళల పేరు మీదే మంజూరవుతాయని స్పష్టం చేశారు. అంతే కాకుండా గతంలో పేదల ఇళ్లపై తీసుకున్న అప్పులను కూడా రద్దు చేస్తున్నామని తెలిపారు. గొర్రెల పంపీణీకి రూ. 4,463 కోట్ల నిధులు విడుదల చేస్తామన్నారు.
ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం(Telangana Cabinet) ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గొర్రెల పథకానికి సంబంధించి రెండో విడత పంపిణీ వచ్చే ఏప్రిల్ నెలలో ప్రారంభించడం జరుగుతుందని స్పష్టం చేశారు. అంతే కాకుండా రాష్ట్రంలోని 4 లక్షల ఎకరాల్లో పోడు భూముల పట్టాలు పంపిణీ చేస్తామని వెల్లడించారు.
Also Read : అరెస్ట్ అయ్యేనా అసెంబ్లీ రద్దేనా..?