Telangana Whips : సీఎంను కలిసిన విప్ లు
నలుగురికి రేవంత్ రెడ్డి ఛాన్స్
Telangana : హైదరాబాద్ – తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. పదవుల పందేరానికి తెర తీశారు. ఇప్పటికే గత ప్రభుత్వంలో కొలువు తీరిన నామినేటెడ్ పోస్టులకు రాజీనామా చేశారు. మొత్తం 54 మంది తప్పుకున్నారు. తాజాగా సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా నలుగురు కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారికి ప్రభుత్వ విప్ లుగా నియమించారు.
Telangana Whips Met CM
తమకు అరుదైన ఛాన్స్ ఇచ్చినందుకు గాను సదరు ఎమ్మెల్యేలు సీఎం నివాసానికి చేరుకున్నారు. రేవంత్ రెడ్డికి(Revanth Reddy) ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ విప్ లుగా నియమితులైన వారిలో రాంచందర్ నాయక్ , బీర్ల ఐలయ్య, అడ్డూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్ ఉన్నారు.
ఇక ఎమ్మెల్యేల విషయానికి వస్తే ధర్మపురి నియోజకవర్గం నుంచి అడ్డూరి లక్ష్మణ్ గెలుపొందారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పై గెలుపొందారు. బీర్ల ఐలయ్య ఆలేరు నుంచి విజయం సాధించారు. మాజీ విప్ గొంగిడి సునీతను ఓడించారు.
ప్రముఖ పుణ్య క్షేత్రంగా వినుతికెక్కిన వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మీ నర్సింహారావుపై ఆది శ్రీనివాస్ గెలుపొందారు. ఇక డోర్నకల్ నుంచి బీఆర్ఎస్ క్యాండిడేట్ రెడ్యా నాయక్ పై రామచంద్రు నాయకడ్ విజయం సాధించారు.
Also Read : TTD Srivaani Tickets : ఎన్నారైలకు శ్రీవాణి టికెట్లు