Telangana Crime Rate : తెలంగాణలో నేరాల పెరుగుదల
సైబర్ క్రైమ్ లో 17.59 శాతం
Telangana Crime Rate : హైదరాబాద్ – త్వరలోనే ఏడాది ముగుస్తోంది. ఇంకొద్ది గంటల్లో కొత్త ఏడాది 2024 రాబోతోంది. ఇప్పటి వరకు గతంలో కొలువు తీరిన బీఆర్ఎస్ సర్కార్ నేరాలను అదుపు చేశామంటూ ప్రగల్భాలు పలుకుతూ వచ్చింది. తీరా చూస్తే జనం బండకేసి కొట్టారు కేసీఆర్, ఆయన పరివారాన్ని. దీంతో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ కు విస్తు పోయేలా తాజా నివేదిక బయటకు వచ్చింది.
Telangana Crime Rate Update
ఈ ఏడాది 2023లో తెలంగాణలో(Telangana) నేరాలు 8.97 శాతం పెరిగాయి. మొత్తం 1,79,823 కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,24,213 కేసులు పరిష్కారం అయ్యాయి. ఇందులో 69.07 శాతంగా ఉంది క్రైమ్ రేటు. ఇక సైబర్ క్రైమ్ లో 17.59 శాతం పెరగడం విస్తు పోయేలా చేసింది.
ఇక రోడ్డు ప్రమాదాల పరంగా చూస్తే 20, 699 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇందులో 6,788 మంది ప్రాణాలు కోల్పోయారు. 19,137 మంది గాయపడ్డారు. ఇక రేప్ ల గురించి చూస్తే 2,284 మంది రేప్ కు గురయ్యారని క్రైమ్ నివేదిక వెల్లడించింది.
ఆస్తుల పరంగా చూస్తే రూ. 151.78 కోట్లు ఉండగా రూ. 80.81 కోట్లు తిరిగి స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలంగాణ డీజీపీ రవి గుప్తా ప్రకటించారు. 175 కేసులకు సంబంధి పీడీ యాక్ట్ ను నమోదు చేశామన్నారు.
Also Read : PVR Cinemas Offer : సీనీ లవర్స్ కు పీవీఆర్ బంపర్ ఆఫర్