Telangana Election Commission : జానా రెడ్డి..జమునకు ఈసీ షాక్
మొత్తం 4,798 మంది అభ్యర్థులు
Telangana Election Commission : హైదరాబాద్ – తెలంగాణలో ఎన్నికల ఘట్టానికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియకు నవంబర్ 15న డెడ్ లైన్ ప్రకటించింది ఈసీ. దీంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు అందాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, సీపీఎం, సీపీఐ , ఇండిపెండెంట్లు దరఖాస్తు చేసుకున్నారు. నిన్నటి దాకా రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు సంబంధించి 4,798 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించింది. ఇప్పటి దాకా 5,716 నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిపారు.
Telangana Election Commission Rejected Persons
ఒక్క రోజే ఏకంగా దరఖాస్తు చేసిన వాటిలో 600కు పైగా నామినేషన్లు తిరస్కరించినట్లు స్పష్టం చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. విచిత్రం ఏమిటంటే సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి కందూరు జానా రెడ్డికి(Jana Reddy) కోలుకోలేని షాక్ తగిలింది. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున దాఖలు చేసిన నామినేషన్ ను తిరస్కరించినట్లు పేర్కొంది.
అంతే కాకుండా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారథ్యంలోని బీఎస్పీ కి చెందిన అభ్యర్థులకు సంబంధించి 7 నియోజకవర్గాలలో నామినేషన్లు తిరస్కరించినట్లు తెలిపింది. ఇవాల్టితో నామినేషన్ల ఉపసంహరించు కునేందుకు ఆఖరు తేదీ. ఇవాల్టితో డెడ్ లైన్ కావడంతో ఎంతమంది బరిలో ఉంటారనేది తేలనుంది.
Also Read : Tirumala Rush : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.19 కోట్లు