Telangana Elections 2023 : తెలంగాణలో టెన్షన్ టెన్షన్
ఇవాళే అంతిమ తీర్పు వెల్లడి
Telangana Elections 2023 : తెలంగాణ – రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఎవరు గెలుస్తారనే దానిపై పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. పలు పార్టీలు బరిలో ఉన్నా ముక్కోణపు పోటీ నెలకొందని పలువురు భావిస్తున్నారు. ఇక ప్రీ పోల్స్ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అన్నీ గంప గుత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి.
Telangana Elections 2023 Updates
అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి పార్టీ(BRS) ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తున్నామని ముచ్చటగా మూడోసారి కేసీఆర్ సీఎంగా కొలువు తీరుతారని ఆ పార్టీ శ్రేణులు నమ్మకంతో ఉన్నాయి.
మొత్తం 119 నియోజకవర్గాలు ఉన్నాయి. 60 సీట్లు ఏ పార్టీకి వస్తాయో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ప్రతి నియోజకవర్గం ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఇప్పటికే కౌంటింగ్ ప్రారంభమైంది.
ఉదయం 8 గంటలకు పోస్టల్ పోలింగ్ కు సంబంధించి ఓట్లను లెక్కిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఫలితాలకు సంబంధించి వివరాలు ప్రకటిస్తూ వస్తోంది. కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం తమ పార్టీకి కనీసం 80 సీట్లు వస్తాయని అంతకు తక్కువ రావని స్పష్టం చేశారు. ఇక మంత్రి కేటీఆర్ సైతం తమకు 90 సీట్లకు పైగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
Also Read : Akunuri Murali : ఎమ్మెల్యేలు అమ్ముడు పోతే ఊరుకోం