Telangana Government: తెలంగాణాను తాకిన డీలిమిటేషన్ సెగ ! అఖిలపక్ష సమావేశానికి సన్నాహాలు !

తెలంగాణాను తాకిన డీలిమిటేషన్ సెగ ! అఖిలపక్ష సమావేశానికి సన్నాహాలు !

Telangana Government : లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రారంభించిన ఉద్యమం తెలంగాణాను తాకింది. దీనితో ఈ డీలిమిటేషన్ పై త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జానారెడ్డి… రాజకీయ పార్టీలకు బహిరంగ లేఖ రాశారు. క్యాబినెట్‌లో తీసుకున్న నిర్ణయం ప్రకారం నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష భేటీ నిర్వహించాలనుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

Telangana Government-Delimitation

‘‘జనాభా ప్రాతిపదికన జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనతో తెలంగాణకు ప్రమాదం. జరగబోయే నష్టం గురించి అన్ని పార్టీలను ఆహ్వానించి చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశానికి అన్ని పార్టీలు హాజరుకావాలి. ప్రతి పార్టీని ప్రత్యేకంగా ఆహ్వానిస్తాం. త్వరలోనే భేటీకి సంబంధించిన తేదీ, వేదిక ప్రకటిస్తాం’’ అని లేఖలో పేర్కొన్నారు.

Also Read : High Court: కేటీఆర్ పై నమోదైన డ్రోన్ ఫ్లయింగ్ కేసుపై హైకోర్టు విచారణ

Leave A Reply

Your Email Id will not be published!