CM KCR : అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
ఆదేశించిన తెలంగాణ సీఎం కేసీఆర్
CM KCR : రెబల్ స్టార్ , కేంద్ర మాజీ మంత్రి కృష్ణం రాజు(Krishnam Raju) మృతి సినీ రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.
ఆయన అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశించారు సీఎం. ఈ మేరకు సీఎస్ సోమేష్ కుమార్ ఏర్పాట్లు చేయాలని సూచించారు.
సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని మహా ప్రస్థానంలో కృష్ణంరాజు అంత్యక్రియలు జరగనున్నాయి. విలక్షణమైన నటుడిగా గుర్తింపు పొందారని, ఆయన లేని లోటు తీర్చ లేదని పేర్కొన్నారు సీఎం(CM KCR)..
నటుడిగా, కేంద్ర మంత్రిగా విశిష్టమైన సేవలు అందించారని తెలిపారు. నటుడిగా కంటే వ్యక్తిగా ఆయనతో తనకు సన్నిహిత పరిచయం ఉందని గుర్తు చేసుకున్నారు.
ఇవాళ మన మధ్య లేక పోవడం బాధాకరమన్నారు కేసీఆర్. ఆయన మృతికి సంతాప సూచకంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలియ చేస్తున్నారు.
ఆయన సోదరుడి తనయుడే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. కృష్ణం రాజు 183 సినిమాలకు పైగా నటించారు. ప్రతి నాయకుడి పాత్రతో మెప్పించారు.
ఆదివారం ఉదయం 3.25 గంటలకు కన్ను మూశారు. ఏపీలోని మొగల్తూరు ఆయన స్వస్థలం. రెబల్ స్టార్ గా గుర్తింపు పొందారు. విలక్షణమైన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నారు కృష్ణం రాజు.
కొంత కాలం పాటు చదువు అయి పోగానే జర్నలిస్ట్ గా పని చేశారు. మొదట కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1998లో బీజేపీలో చేరి ఎంపీ గా గెలిచారు. వాజయ్ పేయి కేబినెట్ లో మంత్రిగా పని చేశారు.
Also Read : కేసీఆర్ కుమార స్వామి భేటీపై ఉత్కంఠ