Telangana Government: వడదెబ్బ బాధితుల కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
వడదెబ్బ బాధితుల కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
Telangana Government : తెలంగాణాలో ఎండలు మండిపోతున్నాయి. ఈ ఏడాది ఎండలు మరింత ఎక్కువ ఉంటాయని భారత వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలు ప్రజలను మరింత గందరగోళానికి గురిచేస్తున్నాయి. అంతేకాదు ఈ ఏడాది వడదెబ్బలు కూడా అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయని సూచించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి ఎండల తీవ్రత అధికంగా ఉండనున్న నేపథ్యంలో కీలక ప్రకటన విడుదల చేసింది. ముఖ్యంగా వడదెబ్బలపై అలర్ట్ అయిన రాష్ట్ర ప్రభుత్వం… ముందస్తు చర్యలు చేపట్టింది. హీట్‌వేవ్, సన్ స్ట్రోక్ ను స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్ గా ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana Government Weather
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం వడదెబ్బతో చనిపోయిన వారికి ఇక నుంచి ఎస్‌డీఆర్ఎఫ్ కింద అపద్బంధు పేరుతో ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కాగా, ఇప్పటి ఆపద్బంధు పథకం కింద బాధిత వ్యక్తులకు రూ. 50,000 వేలు మాత్రమే ఎక్స్‌గ్రేషియా ఇచ్చారు. ప్రభుత్వ తాజా ప్రకటనతో ఈ పరిహారం భారీగా పెరుగనుంది. ఎండల తీవ్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఒకవైపు ప్రజలకు అవగాహన కల్పిస్తూనే మరోవైపు వడదెబ్బ మృతులకు దాదాపు ఎనిమిది రెట్లు నష్టపరిహారం ప్రకటించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Bhu Bharati: తెలంగాణాలో అమల్లోకి వచ్చిన భూ భారతి పోర్టల్ సేవలు