Telangana Governor KCR : వివక్ష నిజం గవర్నర్ ఆగ్రహం
మరోసారి తమిళిసై సీరియస్
Telangana Governor KCR : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సర్కార్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మహిళను అయినందు వల్లనే పట్టించు కోవడం లేదని వాపోయారు. ఎక్కడైనా దేశంలోని రాష్ట్రాలలో గవర్నర్ కు ప్రోటోకాల్ ఉంటుంది.
కానీ తెలంగాణలో దీనిని అమలు చేయడం లేదని మండిపడ్డారు. తాను ఎప్పుడైతే గవర్నర్ గా కొలువు తీరానో ఆనాటి నుంచి నేటి దాకా ఇదే పరిస్థితి నెలకొందని ఫైర్ అయ్యారు తమిళి సై సౌందర రాజన్. బాధ్యతలు కలిగిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు సైతం రావడం లేదని సంచలన ఆరోపణలు చేశారు గవర్నర్.
తాజాగా పాలమూరుకు వెళ్లాను. అక్కడ విశ్వ విద్యాలయం కాన్వొకేషన్ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా వెళితే అక్కడికి ఎవరూ రాలేదని చెప్పారు. విచిత్రం ఏమిటంటే చివరకు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం లేకుండా చేశారని ఇక్కడ ప్రజాస్వామ్యం అన్నది లేకుండా పోయిందన్నారు తమిళిసై సౌందర రాజన్. ఇదే సమయంలో మరో సంచలన కామెంట్ చేశారు. తన ఫోన్ ట్యాప్ అవుతోందన్న అనుమానం వ్యక్తం చేశారు.
మా అమ్మ చని పోతే దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ ఫోన్ చేసి పరామర్శించారని కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కనీసం మర్యాద పూర్వకంగా పలకరించ లేదని తమిళి సై సౌందర రాజన్(Telangana Governor KCR) ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పీఎం వస్తే సీఎం రాలేదన్నారు. ఆపై ఎట్ హోం కార్యక్రమానికి కూడా రాలేదని ధ్వజమెత్తారు.
Also Read : గ్రూప్ – 4 పోస్టుల భర్తీకి పచ్చ జెండా