Deepavali Holiday : దీపావ‌ళి సెల‌వు రోజు 25 కాదు 24

తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న

Deepavali Holiday : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇప్ప‌టికే దీపావ‌ళి పండుగ ఎప్పుడు జ‌రుపు కోవాల‌నే దానిపై తెలుగు వారు డైల‌మాలో ప‌డ్డారు. ఎవ‌రికి తోచిన మేర‌కు వారు చేసుకుంటున్నారు. మ‌రికొంద‌రు దీపావ‌ళిని ఇత‌ర తేదీల‌లో జ‌రుపుకుంటున్నారు. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే క్యాలెండ‌ర్ ఇయ‌ర్ కు సంబంధించి ఏడాదిలో ఏయే తేదీల‌లో సెలవులు ఉంటాయ‌నేది ప్ర‌క‌టించింది.

కానీ గ‌తంలో ప్ర‌క‌టించిన తేదీ అక్టోబ‌ర్ 25గా దీపావ‌ళి పండ‌గ కోసం సెల‌వు(Deepavali Holiday) ఉండేది. ఆరోజు అనుకోకుండా సూర్య గ్ర‌హ‌ణం ఏర్ప‌డ‌డంతో దానిపై తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్తం అయ్యాయి. దీంతో తెలుగు వారికి ప్రీతి పాత్ర‌మైన పండుగ కావ‌డంతో వారికి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఉండేందుకు గాను తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ఈ మేర‌కు దీపావ‌ళి పండుగ‌కు సంబంధించి అక్టోబ‌ర్ 25 కాద‌ని 24న సెల‌వు మంజూరు చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ విష‌యాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేష్ కుమార్ గురువారం కీల‌క ప్ర‌క‌ట‌న వెల్ల‌డించారు. దీనిపై ఇంకా ఉద్యోగులు, ఇత‌రులు ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌క పోవ‌డం విశేషం.

ఇదిలా ఉండ‌గా సెల‌వును సోమ‌వారంకు మార్చ‌డం విశేషం. మంగ‌ళ‌వారం రోజు అమ‌వాస్యం ఉంది. పండితుల నుంచి పెద్ద ఎత్తున అభ్యంత‌రాలు రావ‌డంతో ఎట్ట‌కేల‌కు ప్ర‌భుత్వం త‌ల వంచింది.

ఈ మేర‌కు వారు కోరిన మీద‌నే 24న సెల‌వు ఇచ్చేందుకు ఒప్పుకుంది. ఓ వైపు అమ‌వాస్య ఇంకో వైపు సూర్య గ్ర‌హ‌ణం ఉండ‌డంతో ఈ సెల‌వు తేదీని మార్చాల్సి వ‌చ్చింద‌ని ప్ర‌భుత్వం పేర్కొంది.

Also Read : ఎన్నిక‌ల క‌మిష‌న్ పై కేటీఆర్ ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!