Telangana Govt : కీలక అంశాలపై చర్చించేందుకు తెలంగాణ క్యాబినెట్ భేటీ

కీలక అంశాలపై చర్చించేందుకు తెలంగాణ క్యాబినెట్ భేటీ..

Telangana Govt : తెలంగాణ కేబినెట్ సమావేశం ఈరోజు (శనివారం) జరుగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది. ఇందులో పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే కొన్ని ముఖ్య అంశాలపై కూడా మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. ముఖ్యంగా మూసీ పునరుజ్జీవంపై, నిర్వాసితులకు సహాయంపై చర్చ జరుగనుంది. ధరణి పోర్టల్‌ పేరును ‘భూమాత’గా మార్చడానికి కొత్త ఆర్వోఆర్‌ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే. ధరణిలో రైతుల హక్కులపై ఏర్పడే సమస్యల పరిష్కారానికి అప్పిలేట్‌ అథారిటీని ఏర్పాటు చేయడానికి ఈ చట్టంపై చర్చిస్తారని తెలుస్తోంది. మూసీ పునరుజ్జీవ చర్యలు, హైడ్రా, 317 జీవో, ఉద్యోగుల డీఏలు, ధాన్యం కొనుగోళ్లు, కొత్త రేషన్‌ కార్డుల జారీ తదితర అంశాలపై కేబినెట్ భేటీ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Telangana Govt Cabinet Meeting

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో హాన్ రివర్ అభివృద్ది నమూనాను మంత్రుల, అధికారుల బృందం అధ్యయనం చేసిన విషయం తెలిసిందే. హాన్ రివర్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ వివరాల రిపోర్ట్‌పై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. రెవిన్యూ శాఖ బలోపేతం, 2024 ఆర్ఓఆర్ చట్టం, ధరణి పేరు మార్పుపై కూడా కేబినెట్‌లో చర్చకు రానుంది. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి కొత్త ఆర్‌ఓఆర్ చట్టం, మూసీ పునరుజ్జీవంపై చర్చించే విషయంపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కులగణన, ఇందిరమ్మ ఇళ్ల విధివిధానాలపై కూడా మంత్రివర్గం చర్చించనుంది. ఇప్పటికే ఇందిరమ్మ కమిటీలకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వగా.. వాటి విధివిధానాలపై కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది. ఉద్యోగుల పెండింగ్ డీఏలు, 317 జీవోపై మంత్రివర్గ ఉప సంఘం చేసిన సిఫారసులపై చర్చించి మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. ధాన్యం కొనుగోలు పాలసీ కోసం ఉప సంఘం ఇచ్చిన నివేదికపై సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

Also Read : Minister Damodara : క్యాన్సర్ అవగాహన సదస్సుపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి దామోదర రాజనరసింహ

Leave A Reply

Your Email Id will not be published!