TS Govt Jobs : ప్రభుత్వ శాఖలు భర్తీ చేసే పోస్టులు
తాజాగా టీఎస్ నోటిఫికేషన్ విడుదల
TS Govt Jobs : లక్షలాది మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ప్రస్తుత తరుణంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా కొన్ని నెలలు గ్యాప్
ఇస్తూ ప్రకటనలు జారీ చేస్తూ వస్తోంది ప్రభుత్వం. ఒక్కో పోస్టుకు వేలాది మంది పోటీ పడుతున్నారు.
ప్రభుత్వ బాధ్యతా రాహిత్యం వల్లే ఆలస్యమైందని విపక్షాలు ఆరోపించాయి. తాజాగా ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. ఈ మేరకు నోటిఫికేషన్ లో 10,105 పోస్టుల భర్తీకి క్లియెరెన్స్(TS Govt Jobs) ఇచ్చింది.
ఈ మేరకు ప్రభుత్వ శాఖలు, జాబ్స్ ఇలా ఉన్నాయి. తాజాగా జారీ చేసిన ఉద్యోగాలలో(TS Govt Jobs) 9,096 పోస్టులు అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో ఉండడం విశేషం.
మహిళా శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న 14 జాబ్స్ ను జిల్లా ఎంపిక కమిటీ ద్వారా భర్తీ చేయనున్నారు.
టీఎస్పీఎస్సీ ద్వారా మహిళా శిశు సంక్షేమ శాఖలో 251 పోస్టులు, వికలాంగ, వృద్దుల శాఖలో ఖాళీగా ఉన్న 71 పోస్టులను, బీసీ సంక్షేమ శాఖ లో
ఖాళీగా ఉన్న 157 పోస్టులను భర్తీ చేయనుంది.
అంతే కాకుండా ఈ కమిషన్ ద్వారా జువైనల్ వెల్ఫేర్ లో 66 జాబ్స్ ను భర్తీ చేయనుంది. ఇక మైనార్టీ గురుకులాల్లో ఖాళీగా ఉన్న 1,445 పోస్టులను,
బీసీ గురుకులాల్లో ఉన్న 3,870 టీఆర్ఈఐఆర్బీ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఇక గిరిజన సహకార సంస్థ లో ఉన్న 15, గిరిజన సంక్షేమ శాఖలో 24 , టీఎస్ఆర్టీఐ లో ఖాళీగా ఉన్న 16 , గిరిజన సంక్షేమ శాఖలో ఉన్న 78 పోస్టులను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ చేయనుంది.
ట్రైబల్ గురుకులాలలో 1,514 పోస్టులు, టీఎస్ డబ్ల్యూఆర్ఐ సొసైటీలో 2,267 పోస్టులను టీఆర్ఈఐఆర్బీ భర్తీ చేయనుంది. ఇక దళిత అభివృద్ధి
శాఖలో ఖాళీగా ఉన్న 316 పోస్టులను టీఎస్పీఎస్సీ భర్తీ చేయనుంది.
Also Read : 10,105 జాబ్స్ భర్తీకి ఆర్థిక శాఖ లైన్ క్లియర్