TS Govt GO : పంతుళ్ల ప్రతాపం తలవంచిన ప్రభుత్వం
ఆస్తుల వివరాల వెల్లడి ప్రకటనపై వెనక్కి
TS Govt GO : పంతుళ్లు తలుచుకుంటే ఏమైనా చేయగలరని మరోసారి నిరూపితమైంది. అడ్డగోలు జీవోలు జారీ చేస్తూ అభాసు పాలవడం పరిపాటిగా మారింది.
తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని విద్యా శాఖ పరిధిలో పని చేస్తున్న పంతుళ్లు ఎవరైనా సరే వారి ఆస్తుల వివరాలు తెలియ చేయాలని విద్యా శాఖ సంచాలకులు జీవో జారీ చేసింది.
ఈ మేరకు వెంటనే అమలులోకి వస్తుందంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ జీవో(TS Govt GO) వెలువడిన వెంటనే పెద్ద ఎత్తున పంతుళ్లు, సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు నిప్పులు చెరిగాయి.
ముందు ప్రజా ప్రనిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎం ఫ్యామిలీ తమ ఆస్తుల వివరాలు ప్రకటించాలని బేషరతుగా ప్రభుత్వ డొమైన్ లో ఉంచాలని డిమాండ్ చేశారు.
దీంతో మొదటికే మోసం వస్తుందని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం విద్యా శాఖ జారీ చేసిన జీవోను(TS Govt GO) తక్షణమే ఉప సంహరించుకున్నట్లు రాత్రికి రాత్రి వెల్లడించింది.
ఈ విషయాన్ని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. నిలిపివేత ఉత్తర్వులను వెంటనే జారీ చేయాలని కూడా ఆమె విద్యా శాఖ సంచాలకులను ఆదేశించారు.
ప్రభుత్వ టీచర్లు ప్రతి ఏటా ఆస్తుల వివరాలు సమర్పించాలని ఇప్పటికే విద్యా శాఖ మాన్యువల్ లో ఉంది. ప్రతి ఏటా ఐటీ రిటర్న్ లో సమర్పిస్తూనే ఉంటారు.
కానీ కొత్తగా ఈ జీవో జారీ చేయడం వెనుక టీచర్లను ఇబ్బంది పెట్టేందుకే అంటూ ఆరోపించారు. మొత్తంగా అబ్బా పంతుళ్ల దెబ్బ అంటున్నారు ఇంకొందరు.
Also Read : తెలంగాణ పంతుళ్లు ఆస్తులు చెప్పాల్సిందే