Telangana Govt : మహిళల కోసం మరో కొత్త స్కీమ్ మొదలుపెట్టిన రేవంత్ సర్కార్

ఎలక్ట్రిక్ ఆటోల్ని నడిపే మహిళలకు ఆర్థిక సహకారాన్ని అందించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందట...

Telangana Govt : రాష్ట్రంలోని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా రేవంత్ సర్కారు బలంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు పథకాలు అమలు చేస్తోంది. ఉచిత బస్సు సౌకర్యం, స్వయం సహాయక బృందాలకు రుణాలు ఇవ్వడం లాంటివి చేస్తోంది. ఇదే క్రమంలో తాజాగా మరో స్కీమ్‌కు శ్రీకారం చుట్టేందుకు కాంగ్రెస్(Congress) ప్రభుత్వం సిద్ధమైంది. మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇంకో కొత్త స్కీమ్‌ తీసుకొచ్చేందుకు రెడీ అయింది. మరి.. రేవంత్(CM Revanth Reddy) సర్కారు తీసుకొచ్చే ఆ కొత్త పథకం ఏంటో ఇప్పుడు చూద్దాం.

Telangana Govt…

ఎలక్ట్రిక్ ఆటోల్ని నడిపే మహిళలకు ఆర్థిక సహకారాన్ని అందించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందట. ఈ మేరకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మహిళల కోసం నయా స్కీమ్ రూపొందించడంపై నజర్ పెట్టిందని తెలుస్తోంది. రోజురోజుకీ పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) నూతన పాలసీని సర్కారు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఒకవైపు కాలుష్యాన్ని నియంత్రించే ఈవీల వాడకాన్ని ప్రోత్సహిస్తూనే.. మరోవైపు స్త్రీల స్వావలంబనకు సహకరించాలని గవర్నమెంట్ భావిస్తున్నట్లు సమాచారం.

ఎలక్ట్రిక్ ఆటోల్ని కొనుగోలు చేసి డ్రైవింగ్ చేసే మహిళలకు అర్థికంగా సహకారాన్ని అందించాలని రేవంత్ సర్కారు భావిస్తోందట. దీనికి సంబంధించి ఆటో డ్రైవింగ్ నేర్పించే ఒక సంస్థ ఆ శాఖ ఉన్నతాధికారులను రీసెంట్‌గా కలిసిందట. ఈ కొత్త పథకం అమల్లోకి వస్తే ఆటో కొనుగోలుకు అయ్యే వ్యయంలో కొంత మొత్తాన్ని రాష్ట్ర సర్కారే భరించనుందని వినిపిస్తోంది.ఈ పథకం తాలూకు ప్లానింగ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారని సమాచారం. కాగా, ఈ ప్రతిపాదిత పథకంపై తెలంగాణ ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే ఈ పథకం అమల్లోకి రానుందని, రేవంత్ నిర్ణయం మేరకు స్కీమ్‌ను స్టార్ట్ చేసేందుకు స్త్రీ, సంక్షేమ శాఖ అధికారులు సమాయత్తం అవుతున్నారని వినిపిస్తోంది.

Also Read : Ex Minister Avanthi : వైసీపీకి బాయ్ బాయ్ చెప్పిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్

Leave A Reply

Your Email Id will not be published!