TREIRB TGT JOBS : గురుకులాల్లో 4,006 టీజీటీ పోస్టులు
నోటిఫికేషన్ విడుదల చేసిన టీఆర్ఈఐఆర్బీ
TREIRB TGT JOBS : ఓ వైపు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీల వ్యవహారం కొనసాగుతుండగానే మరో వైపు తెలంగాణ గురుకులాల సంస్థ నోటిఫికేషన్లు విడుదల చేస్తూ వస్తోంది. తాజాగా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీజీ) పోస్టులకు(TREIRB TGT JOBS) సంబంధించి భారీ ఎత్తున జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇందులో 4,006 టీజీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల్లో అత్యధికంగా మహిళలకు కేటాయించడం విశేషం. మొత్తం పోస్టులలో 3,012 పోస్టులు మహిళలకు అంటే 75 శాతానికి పైగా కేటాయించారు. ఇందులో 994 పోస్టులను సాధారణ కేటగిరీ కింద భర్తీ చేస్తారు. బాలికలు, మహిళా గురుకులాల్లో పోస్టులను మహిళలతోనే నింపాలని భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ధర్మాసనం ఆదేశాల మేరకు గురుకులాల సంస్థ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే 9,231 పోస్టులను ఏప్రిల్ 5న నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజాగా మరో నోటిఫికేషన్ ఇవాళ రిలీజ్ చేసింది. ఇక టీజీపీ పోస్టులకు సంబంధించి బీఏ, బీఎస్సీ, బీకాం డిగ్రీలో 50 శాతం మార్కులతో పాస్ అయి ఉండాలి. పీజీ 50 శాతం మార్కులు , బీఇడి ఉండాలి. ఇక డిగ్రీ కోర్సుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ , దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉండాలి. టెట్ తప్పనిసరి. దరఖాస్తులను ఏప్రిల్ 28 నుంచి మే 27 సాయంత్రం 5 గంటలకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
Also Read : అవినీతికి అందలం చర్యలు శూన్యం