Telangana High Court: కేసీఆర్‌ కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట

కేసీఆర్‌ కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట

Telangana High Court : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. 2011లో అతనిపై నమోదైన రైల్‌ రోకో కేసును హైకోర్టు కొట్టివేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో 2011 అక్టోబర్ 15న సికింద్రాబాద్‌ లో నిర్వహించిన రైల్ రోకో నిర్వహించారు. ఈ క్రమంలో ఈ రైల్ రోకోలో పాల్గొన్న నాయకులు, ఉద్యమకారులతో పాటు దీనికి పిలుపునిచ్చిన కేసీఆర్ పై కూడా కేసు నమోదు చేసారు. ఈ కేసులో కేసీఆర్ ను 13వ నిందితుడిగా రైల్వే పోలీసులు చేర్చారు. అనంతరం ఈ కేసును ప్రజాప్రతినిధుల కోర్టుకు బదిలీ చేసి అక్కడ అభియోగపత్రం దాఖలు చేశారు.

Telangana High Court Big Relief to KCR

ఈ కేసు చాలా కాలంగా పెండింగ్‌ లో ఉన్న నేపథ్యంలో… రైల్ రోకోలో తన ప్రమేయం లేదని… ఆ కేసును కొట్టివేయలంటూ కేసీఆర్… తెలంగాణా హైకోర్టులో(Telangana High Court) పిటీషన్ దాఖలు చేసారు. రైల్‌రోకో జరిగిన సమయంలో కేసీఆర్‌ సంఘటన స్థలంలో లేరని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. కేసీఆర్‌ పిలుపుతోనే రైల్‌ రోకో నిర్వహించారని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ తన వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం… కేసీఆర్‌పై నమోదైన కేసును కొట్టివేస్తూ తుది తీర్పు వెలువరించింది. దీనితో కేసీఆర్ కు భారీ ఊరట లభించినట్లయింది.

Also Read : Bomb Threat: నాగర్ కర్నూల్ కలెక్టరేట్ కు బాంబు బెదిరింపులు

Leave A Reply

Your Email Id will not be published!