Telangana High Court : గ్రూప్ -1 పరీక్ష రద్దు సబబే – హైకోర్టు
డివిజన్ బెంచ్ సంచలన తీర్పు
Telangana High Court : హైదరాబాద్ – తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది మరోసారి హైకోర్టు. బుధవారం ఇందుకు సంబంధించి కీలక తీర్పు వెలువరించింది. గ్రూప్ -1 పరీక్ష రద్దుపై హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు చెప్పింది.
Telangana High Court Comment Viral
పరీక్ష రద్దు సబబేనని అభిప్రాయ పడింది. గ్రూప్ -1 పరీక్షను తిరిగి నిర్వహించాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది హైకోర్టు. అంతే కాకుండా అభ్యర్థుల నుండి బయో మెట్రిక్ తీసుకోవాలని ఆదేశించింది. ఇప్పటికే లక్షలాది మంది అభ్యర్థులు గ్రూప్ -1 పరీక్షపై ఆధారపడ్డారు. ఇప్పటికే భారీ ఎత్తున ఖర్చు కూడా చేశారు.
గ్రూప్ -1 పరీక్షలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ ఆరోపణలు వచ్చాయి. దీనిని ఖండించింది తెలంగాణ ప్రభుత్వం. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి ఖండించారు. ఆయనకు వంత పాడారు మంత్రి కేటీఆర్(KTR), ఇతర మంత్రులు.
కానీ ఊహించని రీతిలో హైకోర్టు రద్దు చేయడంతో కోలుకోలేని దెబ్బ పడింది. చైర్మన్ తో పాటు సభ్యులపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. డబ్బులు తీసుకుని పరీక్ష పేపర్లు బయటకు వచ్చాయని, కొందరు పనిగట్టుకుని కాపీలు కొట్టారంటూ విమర్శలు కూడా ఉన్నాయి.
దీనిపై కోర్టుకు వెళ్లడంతో టీఎస్పీఎస్సీ ఇచ్చిన నివేదిక తప్పుల తడకగా ఉందని భావించింది ధర్మాసనం. డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు సరైనదేనని పేర్కొంది హైకోర్టు.
Also Read : Nara Lokesh : లోకేష్ ముందస్తు బెయిల్ దాఖలు