Telangana High Court : తెలంగాణ సర్కార్ పై హైకోర్టు ఫైర్
టీఎస్పీఎస్సీ సభ్యుల నియామకంపై తీర్పు
Telangana High Court : తెలంగాణ ప్రభుత్వానికి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల నియాకంపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆరుగురు టీఎస్పీఎస్సీ సభ్యుల నియామకాన్ని పునః పరిశీలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బండి లింగా రెడ్డి, కారం రవీందర్ రెడ్డి, ఆర్. సత్యనారాయణ కు చెందిన నియామకం పై పరిశీలించాలని స్పష్టం చేసింది.
వీరితో పాటు రమావత్ ధన్ సింగ్, సుమిత్ర ఆనంద్ తనోబా, ఆర వెల్లి చంద్రశేఖర్ పై కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. ఇదిలా ఉండగా కాకతీయ యూనివర్శిటీ విశ్రాంత ప్రొఫెసర్ ఎ. వినాయక్ రెడ్డి పిల్ పై విచారణ చేపట్టింది. దీనిపై సంచలన కామెంట్స్ చేసింది ధర్మాసనం. టీఎస్పీఎస్సీ సభ్యులను నియమిస్తూ 2001 మే 19న జీవో 108 జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. కాగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆరుగురు సభ్యుల అర్హతలు, విశిష్టతలు లేవని పిటిషనర్ తన పిల్ లో పేర్కొన్నారు.
మూడు నెలల్లో కసరత్తు పూర్తి చేయాలని సర్కార్ ను ఆదేశించింది హైకోర్టు(Telangana High Court). ఆరుగురి నియామకాన్ని రద్దు చేయాలన్న ప్రశ్న ప్రస్తుత దశలో అవసరం లేదని అభిప్రాయపడింది. ఆరుగురి నియామకం ప్రభుత్వం తాజా కసరత్తుకు లోబడి ఉంటుందని పేర్కొంది.
మరో వైపు పబ్లిక్ సర్వీస్ కమీషన్ లో పరీక్ష పేపర్ల లీకుల వ్యవహారం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. దీనికి సంబంధించి ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. నివేదిక ఇప్పటి వరకు పూర్తి కాలేదు. పలువురిని అరెస్ట్ చేసినా ఇంకా ఎవరు దోషులు అనేది తేల్చలేదు.
Also Read : Perni Nani : ప్యాకేజీ పవన్ కు అంత సీన్ లేదు – నాని