Telangana High Court: మే 5 నుంచి జూన్‌ 6 వరకు హైకోర్టుకు వేసవి సెలవులు

మే 5 నుంచి జూన్‌ 6 వరకు హైకోర్టుకు వేసవి సెలవులు

Telangana High Court : మే 5 నుంచి జూన్‌ 6 వరకు హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటిస్తూ హైకోర్టు(Telangana High Court) రిజిస్ట్రార్ జనరల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మే నెలలో 5, 12 19, 26, తేదీల్లో మరియు జూన్‌ 2 తేదీల్లో కేసుల ఫైలింగ్, మే 7, 14, 21, 28, జూన్‌ 4 తేదీల్లో విచారణ జరుగుతుందని పేర్కొన్నారు. హెబియస్‌ కార్పస్, ముందస్తు బెయిల్, ట్రయల్‌ కోర్టు తిరస్కరించిన వాటిపై బెయిల్‌ అప్లికేషన్లు, ఇతర అత్యవసర కేసులను సెలవుల్లోని బెంచ్‌ల వద్ద ఫైలింగ్‌ చేయొచ్చని చెప్పారు. లంచ్‌ మోషన్‌ కేసులు, అత్యవసర పిటిషన్ల మెన్షన్‌ (విచారణ కోరడం)లపై డివిజన్‌ బెంచ్‌లో సీనియర్‌ న్యాయమూర్తి నిర్ణయం తీసుకుంటారు.

Telangana High Court – వేసవి సెలవుల్లో బెంచ్ ల వివరాలు ఇవే

మే 7న…

సింగిల్‌ బెంచ్‌: జస్టిస్‌ పుల్ల కార్తీక్‌
డివిజన్‌ బెంచ్‌: జస్టిస్‌ సూరేపల్లి నందా, జస్టిస్‌ జె.శ్రీనివాస్‌రావు

మే 14…

సింగిల్‌ బెంచ్‌: జస్టిస్‌ జె.శ్రీనివాస్‌రావు
డివిజన్‌ బెంచ్‌: జస్టిస్‌ పుల్ల కార్తీక్, జస్టిస్‌ నందికొండ నర్సింగ్‌రావు

మే 21…

సింగిల్‌ బెంచ్‌: జస్టిస్‌ జె.శ్రీనివాస్‌రావు
డివిజన్‌ బెంచ్‌: జస్టిస్‌ నగేశ్‌ భీమపాక, జస్టిస్‌ నందికొండ నర్సింగ్‌రావు

మే 28…

సింగిల్‌ బెంచ్‌: జస్టిస్‌ కె.శరత్‌
డివిజన్‌ బెంచ్‌: జస్టిస్‌ నగేశ్‌ భీమపాక, జస్టిస్‌ లక్ష్మీనారాయణ అలిశెట్టి

జూన్‌ 4…

సింగిల్‌ బెంచ్‌: జస్టిస్‌ కె.సుజన
డివిజన్‌ బెంచ్‌: జస్టిస్‌ కె.శరత్, జస్టిస్‌ బీఆర్‌ మధుసూదన్‌రావు

Also Read : Minister Ponguleti Srinivas Reddy: ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

Leave A Reply

Your Email Id will not be published!