Telangana High Court: రైల్ రోకో కేసులో కేసీఆర్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ
రైల్ రోకో కేసులో కేసీఆర్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ
Telangana High Court : తెలంగాణా ఉద్యమ సమయంలో రైల్ రోకో ఘటనలో తనపైన నమోదైన కేసును కొట్టి వేయాలంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ దాఖను చేసిన పిటీషన్ పై మంగళవారంలో హైకోర్టులో(Telangana High Court) విచారణ జరిగింది. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఉద్యమంలో భాగంగా 2011 అక్టోబర్ 15న సికింద్రాబాద్ లో పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు రైల్ రోకో చేపట్టారు. దీనితో అప్పటి ప్రభుత్వం రైల్ రోకోలో పాల్గొన్న పలువురిని అరెస్ట్ చేసి వారిపై కేసులు నమోదు చేసింది. అయితే అప్పటి టీఆర్ఎస్… ప్రస్తుత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపుమేరకే ఈ రైల్ రోకో నిర్వహించారని అతనిపై కేసు నమోదు చేసారు. ప్రస్తుతం ఆ కేసు ప్రజాప్రతినిధుల కోర్టులో పెండింగ్‌లో ఉంది.
Telangana High Court…
దీనితో రైల్ రోకోలో తన ప్రమేయం లేదని… ఆ కేసును కొట్టివేయలంటూ కేసీఆర్… తెలంగాణా హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. దీనిపై మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టుకు… కేసీఆర్ పిలుపు మేరకే రైల్‌రోకో చేపట్టారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. అయితే, రైల్ రోకో జరిగిన సమయంలో అక్కడ కేసీఆర్ లేరని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం… రైల్‌రోకో ఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తికి నోటీసులివ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ వాయిదా వేసింది.
Also Read : Kanchegachibowli Land: తెలంగాణా రాజకీయాల్లో కాక రేపుతోన్న కంచ గచ్చిబౌలి భూ వివాదం