Telangana High Court : మెడికల్ సీట్లపై హైకోర్టు తీర్పు
కాంపిటీటివ్ కోటా సీట్లన్నీ భర్తీ
Telangana High Court : హైదరాబాద్ – తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలలో సీట్ల భర్తీకి సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టింది. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పింది.
Telangana High Court Latest Update
జూన్ 2, 2014 తర్వాత ఏర్పాటైన మెడికల్ కాలేజీలలో 100 శాతం కాంపిటీటివ్ అథారిటీ కోటా సీట్లను తెలంగాణ విద్యార్థులకు రిజర్వ్ చేస్తూ తెలంగాణ బీఆర్ఎస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీనిపై సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వంద శాతం సబబేనని కోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు ఇందులో ఎలాంటి అన్యాయం లేదని, పక్షపాతం లేదని స్పష్టం చేసింది. హైకోర్టు సంచలన తీర్పు కారణంగా ప్రస్తుతం ఉన్న సీట్లకు అదనంగా మరో 520 సీట్లు అందుబాటులోకి రానున్నాయి.
ఇదిలా ఉండగా గతంలో సీఎం కేసీఆర్(CM KCR) సర్కార్ బి కేటగిరీ సీట్లలో స్థానికులకు 85 శాతం సీట్లు రిజర్వ్ చేసింది. దీని వల్ల విద్యార్థులకు 1,300 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ రెండు నిర్ణయాల వల్ల తెలంగాణ స్టూడెంట్స్ కు 1,820 సీట్లు జోడించాయి. ఈ సీట్లు 20 కొత్త మెడికల్ సీట్లకు సమానం.
Also Read : CM KCR : 15న బీఆర్ఎస్ కీలక సమావేశం