Secretariat Departments : ఆరు అంతస్తులు ప్రభుత్వ శాఖలు
తెలంగాణ సచివాలయం
Secretariat Departments : బీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ తనన కలల సాకారమైన నూతన సచివాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా దీనిని తెలంగాణ సంస్కృతికి దర్పణంగా నిలిచేలా కట్టారు. కోట్లాది రూపాయలు వెచ్చించారు. నిన్నటి దాకా పాలనా పరంగా బీఆర్కే భవన్ నుంచే కార్యకలాపాలు కొనసాగాయి. ఏప్రిల్ 30 ఆదివారం నుంచి కొనసాగనున్నాయి. కొత్త సీఎస్ గా శాంతి కుమారి కొలువు తీరారు.
మొత్తం సచివాలయంలో 6 అంతస్తులు ఉన్నాయి. వీటిలో గ్రౌండ్ ఫ్లోర్ లో ఎస్సీ సంక్షేమ అభివృద్ది, మైనార్టీ సంక్షేమం, రెవెన్యూ, కార్మిక, ఉపాధి కల్పన శాఖలకు కేటాయించారు(Secretariat Departments). తొలి ఫ్లోర్ లో హోం, గ్రామీణాభివృద్ది, విద్యా, పంచాయతీరాజ్ శాఖలను చేర్చారు. 2వ అంతస్తులో వైద్య ఆరోగ్యం, విద్యుత్, పశు సంవర్దక, ఆర్థిక శాఖలు ఉన్నాయి. 3వ అంతస్తులో మహిళా శిశు సంక్షేమం, గిరిజన , పురపాలక, పట్టణాభివృద్ది, ప్లానింగ్, ఐటీ, వ్యవసాయ, సహకార, పరిశ్రమలు, వాణిజ్య శాఖలకు కేటాయించారు.
4వ ఫ్లోరర్ లో పౌర సరఫరాలు, వినియగదారుల వ్యవహారాలు, యువజన, పర్యాటక, బీసీ సంక్షేమ, పర్యావరణ, అటవీ శాస్త్ర సాంకేతిక, నీటి పారుదల, న్యాయ శాఖలు ఉన్నాయి. 5వ అంతస్తులో రవాణా, రహదారులు, సాధారణ పరిపాలన, భవనాల శాఖలకు కేటాయించారు. 6వ అంతస్తులో సీఎం, సీఎంఓ , పేషీ, కార్యదర్శులు ఉంటారు.
Also Read : సచివాలయం ఇంధ్ర భవనం