#PallePragati : తెలంగాణ రూపురేఖలను మారుస్తున్న పల్లె ప్రగతి

Palle Pragati changing the face Rural progress of Telangana

Palle Pragati: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను మారుస్తున్నాయి పల్లె ప్రగతి కార్యక్రమం. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా చేపట్టిన పనులు తెలంగాణ ప్రాంతంలో ఉన్న పల్లెలను యావత్ భారతదేశానికి ఆదర్శ గ్రామాలు నిలుస్తున్నాయి.పల్లె ప్రగతి (Palle Pragati)కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పచ్చదనం – పరిశుభ్రత వెల్లివిరియాలని ప్రభుత్వం ఆశించింది. ఈ లక్ష్యం వందకు వందశాతం నెరవేరుతున్నది.

తెలంగాణ పల్లెలు పరిశుభ్ర, ఆరోగ్య ఆవాసాలుగా రూపాంతరం చెందాయి. పారిశుధ్య కార్యక్రమాల్లో భాగంగా గ్రామాల్లో గుంతలను పూడ్చటం, పిచ్చిచెట్లను కొట్టేయడం, పాత బావులను, బొందలను పూడ్చడం వల్ల నీరు నిల్వ ఉండడం లేదు. దోమలు తగ్గాయి. ఈ ఏడాది డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు ఎక్కువగా ప్రబలకపోవడానికి పల్లె ప్రగతి ద్వారా చేపట్టిన పారిశుధ్య కార్యక్రమాలే కారణం. అన్ని గ్రామాల్లో నర్సరీల ఏర్పాటు, వైకుంఠధామాల నిర్మాణం, ట్రాలీ ట్యాంకర్లతో కూడిన ట్రాక్టర్లు సమకూర్చడం, ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ ద్వారా సురక్షిత మంచినీటి సరఫరా, విలేజ్ కామన్ డంప్ యార్డుల నిర్మాణం, పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు, వ్యవసాయ క్షేత్రాల్లో కల్లాల నిర్మాణం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం లాంటి లక్ష్యాలను ప్రభుత్వం నిర్దేశించుకున్నది. అన్ని లక్ష్యాలను దాదాపు చేరుకుంటున్నది.

ఇలా అన్ని గ్రామాల్లో ఇలాంటి వసతులు సమకూరడం దేశంలో మరెక్కడా లేదు. తెలంగాణ పల్లెలు(Palle Pragati) ఇవాళ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి. గ్రామాల్లో పచ్చదనం పెంచడం, పరిశుభ్రత పాటించడం నిరంతరం కొనసాగాలి.‘‘గతంలో గ్రామాల్లో పాలన, పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా, అరాచకంగా ఉండేది. తెలంగాణ పల్లెలను గొప్పగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చింది. పరిపాలనలో సంస్కరణలు తెచ్చింది. తండాలు, గూడేలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మార్చింది. ప్రతి గ్రామానికి గ్రామ కార్యదర్శిని నియమించింది. క్రమం తప్పకుండా పల్లె ప్రగతి కోసం నిధులను సమకూరుస్తున్నది.

దేశంలో మరెక్కడా లేనివిధంగా కేంద్ర ఆర్ధిక సంఘం నిధులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులను సమకూరుస్తున్నది. కరోనా కష్ట సమయంలో కూడా ఇతర ఖర్చులు తగ్గించుకొని మరీ గ్రామ పంచాయతీలకు నిధులను అందించింది. గ్రామ పంచాయతీలకు ఇపుడు నిధుల కొరత లేదు. విధులు నిర్వర్తించడానికి అవసరమైన అధికారాలను ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఇచ్చింది. గతంలో గ్రామ పంచాయతీల్లో మంచినీటి సరఫరా కోసం ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేది. మిషన్ భగీరథ కారణంగా గ్రామ పంచాయతీలకు ఆ తలనొప్పులు పోయాయి. మంచినీళ్ల కోసం ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది.

నిధుల కొరత లేకపోవడంతో విద్యుత్ బిల్లులను కూడా ఎప్పటికప్పుడు చెల్లించగలుగుతున్నారు. 90శాతం వరకు గ్రామ పంచాయతీల్లో మంచి సర్పంచులు ఉన్నారు. వారిలో అత్యధికులు విద్యావంతులు, యువకులు కావడంతో చిత్తశుద్ధితో గ్రామాభివృద్ధికి పాటుపడుతున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో గ్రామాలు ప్రగతి పథాన(Palle Pragati) నడుస్తున్నాయి’’ అని చెప్పవచ్చును……

No comment allowed please