Telangana Police: హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర ! భగ్నం చేసిన తెలంగాణ పోలీసులు !

హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర ! భగ్నం చేసిన తెలంగాణ పోలీసులు !

Telangana Police : భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్న వేళ… హైదరాబాద్ లో పేలుళ్ళకు కుట్ర పన్నారు. అయితే తెలంగాణా పోలీసులు(Telangana Police) ఆ కుట్రను భగ్నం చేసారు. కుట్రను ఛేదించి సమర్ధవంతంగా నిందితులకు భారీ షాక్ ఇచ్చారు. ఈ పేలుళ్ళ కుట్రకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన తెలంగాణా పోలీసులు… వారి వద్ద నుండి పేలుళ్ళకు ఉపయోగించే పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

Telangana Police Foils..

ఏపీలోని విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్(29), హైదరాబాద్‌ కు చెందిన సయ్యద్ సమీర్(28) ఇద్దరూ కలిసి… విజయనగరంలో పేలుడు పదార్థాలను కొనుగోలు చేశారు. వీరిద్దరూ కలిసి హైదరాబాద్‌ లో​ పేలుళ్లకు పక్కా ప్లాన్‌ చేసుకున్నారు. సౌదీ అరేబియా నుంచి ఐసీసీ మాడ్యుల్‌ ద్వారా వీరికి ఆదేశాలు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. దీనితో అప్రమత్తమైన పోలీసులు… విజయనగరంలోని సిరాజ్ ఉర్ రెహ్మాన్ ఇంటిలో తనిఖీలు నిర్వహించగా పేలుళ్లకు వినియోగించే అమ్మోనియా, సల్ఫర్, అల్యూమినియం పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతడ్ని విచారించగా హైదరాబాద్ కు చెందిన సయ్యద్ సమీర్ గురించి తెలిపింది. దీనితో ఇరువురిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్లుగా తెలిపారు. విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసి… హైదరాబాద్‌లో డమ్మీ బ్లాస్ట్‌ కు ప్లాన్ చేశారని పోలీసుల ప్రాధమిక విచారణలో బయటపడింది.

పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారత్ ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) పేరుతో ఉగ్రసంస్థలు, వాటి స్థావరాలపై అటాక్ చేయడం తెలిసిందే. ప్రతిదాడులకు దిగిన పాకిస్థాన్‌ను భారత్ చిత్తు చేయడం, ఆ దేశ ఎయిర్‌బేస్‌లు ధ్వంసం చేయడం చూస్తూనే ఉన్నాం. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో రాష్ట్రాలన్నీ అలర్ట్‌గా ఉండాలని ఇటీవల ఆదేశించింది కేంద్రం. పాకిస్థాన్ ప్రేరేపిత స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయ్యే ప్రమాదం ఉందని… అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని మోదీ సర్కారు హెచ్చరించింది. ఈ తరుణంలో హైదరాబాద్‌లో భారీ పేలుళ్లకు కుట్ర పన్నడం కలకలం సృష్టించింది. అయితే తెలంగాణ పోలీసులు అలర్ట్ అయ్యారు. బ్లాస్ట్‌లకు ప్లాన్ చేసిన ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకొని ముప్పును తప్పించారు. దీనితో పోలీసుల మీద ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి.

Also Read : Fire Accident: గుల్జార్‌హౌస్‌ లో భారీ అగ్నిప్రమాదం ! 17 మంది మృతి !

Leave A Reply

Your Email Id will not be published!