Telangana Tourists: శ్రీనగర్ హోటల్ లో బిక్కుబిక్కుమంటున్న 80 మంది తెలంగాణ పర్యాటకులు
శ్రీనగర్ హోటల్ లో బిక్కుబిక్కుమంటున్న 80 మంది తెలంగాణ పర్యాటకులు
Telangana Tourists : కశ్మీర్ లోని పహల్గాంలోని పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడితో… తెలంగాణాలో అలజడి రేగుతోంది. దీనికి కారణం తెలంగాణా నుండి కశ్మీర్ కు వెళ్లిన సుమారు 80 మంది పర్యాటకులు శ్రీనగర్ లో ఓ హోటల్ లో చిక్కుకుపోవడమే కారణంగా కనిపిస్తోంది. తెలంగాణలోని(Telangana) పలు జిల్లాల నుంచి శ్రీనగర్ కు వెళ్లిన పర్యాటకులు… పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం శ్రీనగర్ లోని ఓ హోటల్ లో దాదాపు 80 మంది తెలంగాణ పర్యటకులు చిక్కుకుపోయారు. దీనిపై వారు ఓ వీడియో విడుదల చేశారు. తామంతా హోటల్ లో చిక్కుకుపోయామని… తమను హైదరాబాద్‌కు సురక్షితంగా చేర్చాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Telangana Tourists in Srinagar
హోటల్‌లో చిక్కుకున్న వారిలో హైదరాబాద్ నుంచి 20 మంది, వరంగల్ నుంచి 10 మంది, మహబూబ్‌నగర్‌నుంచి 15 మంది, సంగారెడ్డి నుంచి 10 మంది ఉన్నట్లు సమాచారం. మెదక్ పట్టణానికి చెందిన రెండు కుటుంబాలు కూడా ఉన్నాయి. వీరంతా మంగళవారం జమ్మూకశ్మీర్ సందర్శనకు వెళ్లి శ్రీనగర్ హోటల్‌లో చిక్కుకుపోయారు. పహల్గాం ఉగ్రదాడి తరువాత కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్ లో భద్రతను కట్టుదిట్టం చేసినప్పటికీ… ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉగ్రవాదులు విరుచుకుపడతారో తెలియక పర్యాటకులు బిక్కుబిక్కుమంటున్నారు. ఈ నేపథ్యంలో తమను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
Also Read : Donald Trump: పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్‌కు మద్దతుగా ప్రపంచ నేతల సంఘీభావం