Telugu Tourists: మంత్రి లోకేశ్ చొరవతో విశాఖ చేరుకున్న నేపాల్ బాధితులు

మంత్రి లోకేశ్ చొరవతో విశాఖ చేరుకున్న నేపాల్ బాధితులు

Telugu Tourists : నేపాల్ లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు విద్య,ఐటీ,ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) చూపిన ప్రత్యేక చొరవ ఫలించింది. గత రెండు రోజులుగా ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు, కేంద్ర ప్రభుత్వం, నేపాల్ (Nepal) రాయబార కార్యాలయం, రాష్ట్రానికి చెందిన మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. ఖాట్మాండూ, హేటౌడా, పోఖరా, సిమికోట్ తదితర ప్రాంతాల్లో తెలుగువారు తలదాచుకున్నారు. వీరందరినీ ప్రత్యేక విమానాల ద్వారా ఏపీకు చేరుకున్నారు. ఖాట్మాండూ విమానాశ్రయం నుంచి రాష్ట్రానికి బయలుదేరిన 144 మంది… సురక్షితంగా విశాఖపట్నం చేరుకున్నారు. వీరికి విశాఖ విమానశ్రయంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు.

Telugu Tourists From Nepal Reached to Vizag

విశాఖ ఎయిర్ పోర్టులో రన్ వే నుంచి లాంజ్ లోకి చేరుకున్న పౌరులకు స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు. నేపాల్ నుండి వచ్చిన పౌరులకు ప్రత్యేకంగా ప్యాకింగ్ చేసిన స్నాక్స్ ను అధికారులు అందజేసారు. ప్రత్యేక విమానంలో వచ్చిన వారిని జిల్లాల వారీగా కూర్చోబెట్టి వివరాలు సేకరించిన అధికారులు… వారు తన స్వస్థలాలకు పంపించడానికి ఏర్పాటు చేస్తున్నారు. విమానాశ్రయంలో తెలుగు పౌరులకు స్వాగతం పలికిన వారిలో విశాఖ ఎంపీ భరత్, విప్ వేపాడ చిరంజీవి రావు, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, బేబీ నాయన, ఎన్ .ఈశ్వరరావు, కోళ్ల లలిత కుమారి, అదితి గజపతి, వి.ఎం.ఆర్.డి.ఎ. చైర్మన్ ప్రణవ్ గోపాల్, ఏపీ గ్రోవర్స్ ఆయిల్స్ & సీడ్స్ కార్పొరేషన్ ఛైర్మన్ గండిబాబ్జీ, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఉన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చొరవకు వారు ధన్యవాదాలు తెలిపారు.

అలాగే బీహార్ సరిహద్దు ద్వారా 22 మంది భారత్ లోకి ప్రవేశించారు. సిమికోట్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా భారత సరిహద్దులోని నేపాల్ గంజ్ కు 12 మంది చేరుకున్నారు. ఈ సందర్భంగా నేపాల్ లో చిక్కుకున్న చివరి తెలుగు వ్యక్తిని రాష్ట్రానికి సురక్షితంగా తీసుకువచ్చేంత వరకు ఏపీ భవన్, ఆర్టీజీఎస్ కేంద్రంలో ఏర్పాటుచేసిన హెల్ప్ లైన్ సెంటర్ కొనసాగనుంది. వారిని తీసుకువచ్చే బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం తీసుకోనుంది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీచేయడం జరిగింది.

Also Read : MLA Raja Singh: కిషన్‌ రెడ్డిపై రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు

Leave A Reply

Your Email Id will not be published!