Temple Chariot: బెంగుళూరు జాతరలో అపశృతి ! కుప్పకూలిన 120 అడుగుల రథం !
బెంగుళూరు జాతరలో అపశృతి ! కుప్పకూలిన 120 అడుగుల రథం !
Temple Chariot : కర్ణాటకలోని బెంగళూరు శివార్లలో జరిగిన జాతరల అపశృతి చోటుచేసుకుంది. జాతరలో ఊరేగింపు సందర్భంగా 120 అడుగుల రథం కూలింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
Temple Chariot Collapsed
అనేకల్‌లోని హుస్కూర్‌లో శనివారం మద్దురమ్మ జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా వంద అడుగులకుపైగా ఎత్తైన రెండు రథాలను ఆలయ నిర్వాహకులు సిద్ధం చేశారు. ఊరేగింపు సందర్భంగా రెండు రథాలను తాళ్ల సహాయంతో భక్తులు లాగారు. అయితే ఈదురు గాలుల వల్ల 120 అడుగుల ఎత్తైన రథం అదుపుతప్పి(Temple Chariot) ఒక పక్కకు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి చెందగా… పలువులు గాయపడ్డారు. వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
మృతి చెందిన వ్యక్తిని తమిళనాడులోని హోసూర్‌కు చెందిన లోహిత్ గా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఏడాది కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. ఇదే ఉత్సవంలో రథం కూలిపోవడంతో… పార్క్ చేసిన అనేక వాహనాలు దెబ్బతిన్నాయి. అయితే అప్పుడు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
Also Read : Sambhal Violence: సంభాల్ హింసాకాండలో జామా మసీదు చీఫ్ జాఫర్ అలి అరెస్టు