Hyderabad Protest : హైదరాబాద్ లో టెన్షన్ టెన్షన్
బీజేపీ ఎమ్మెల్యే కామెంట్స్ కలకలం
Hyderabad Protest : గతంలో ఎన్నడూ లేని రీతిలో మళ్లీ అల్లర్లు చోటు చేసుకున్నాయి తెలంగాణలోని హైదరాబాద్ లో. ఇప్పటికే బీజేపీకి చెందిన గోషా మహల్ ఎమ్మెల్యే టి. రాజా సింగ్ మహ్మద్ ప్రవక్తపై కామెంట్స్ చేశారంటూ ఎంఐఎం ఆధ్వర్యంలో ముస్లింలు పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలకు దిగారు.
పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో ఉంచాలని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దంటూ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
ఎంతటి వారైనా ఏ స్థాయిలో ఉన్నా సరే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పాతబస్తీలో ఆందోళనకారులు(Hyderabad Protest) రెచ్చి పోయారు. ఎక్కడికక్కడ పోలీసులు మోహరించారు.
మత పరమైన నినాదాలు, దిష్టి బొమ్మల దహనం , రాళ్లు రువ్విన ఘటనలు చోటు చేసుకున్నాయి. నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు.
ఎక్కువగా పాత బస్తీలోనే ఇవి ఎక్కువగా చోటు చేసుకోవడం విశేషం. సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్యే రాజాసింగ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిరసనలు చేపట్టారు.
అర్దరాత్రి ఆందోళనకు దిగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. చార్మినార్ తో పాటు పలు ప్రాంతాల్లో కూడా నిరసనలు మిన్నంటాయి.
ఎమ్మెల్యేను అరెస్ట్ చేసిన అనంతరం కోర్టులో హాజరు పరిచారు. కస్టడీ కోసం పోలీసులు అభ్యర్థించారు. కోర్టు తిరస్కరించడంతో ఆయనకు బెయిల్ మంజూరైంది.
మునావర్ ఫారూఖీ పర్యటనను వ్యతిరేకించారు రాజా సింగ్. మరో వైపు టి. రాజా సింగ్ కామెంట్స్ చేసిన వీడియోను యూట్యూబ్ తొలగించింది.
Also Read : లా అండ్ ఆర్డర్ ముఖ్యం – కేసీఆర్