Araga Jnanendra : మంగళూరు పేలుడు వెనుక ఉగ్ర చర్య
టెర్రర్ లింకులపై వివరాలు వెల్లడిస్తాం
Araga Jnanendra : కర్ణాటకలోని మంగళూరులో ఆటో రిక్షాల్లో పేలుడు సంభవించింది. ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. పేలుడు సంభవించిన తర్వాత ఆటో రిక్షాలో మంటలు అంటుకున్నట్లు లొకేషన్ లో సీసీ టీవీ విజువల్స్ కనిపించాయి. ఆటో డ్రైవర్ , ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి.
వారిని ఆస్పత్రికి తరలించారు. సీసీ టీవీ ఫుటేజీ ని పరిశీలిస్తున్నారు పోలీసులు. నవంబర్ 19న చోటు చేసుకుంది ఈ ప్రమాదం. కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులు విచారణ ప్రారంభించారని కర్ణాటక హోం శాఖ మంత్రి అరగ జ్ఞానేంద్ర(Araga Jnanendra) తెలిపారు. ఈ సంఘటన ఉగ్ర దాడి చర్య అని రాష్ట్ర అత్యున్నత పోలీసు అధికారి ప్రవీణ్ సూద్ ధ్రవీకరించారు.
ఆయన ప్రకటించిన కొద్ది సేపటికే రాష్ట్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళూరులో నిన్న మధ్యాహ్నం కదులుతున్న ఆటో రిక్షాలో పేలుడు సంభవించిందని , ఈ ఘటనలో గాయపడిన డ్రైవర్ చికిత్స పొందుతున్నాడని తెలిపారు. అయితే ఇప్పుడు డ్రైవర్ మాట్లాడే స్థితిలో లేరన్నారు.
ఇందుకు సంబంధించి రాష్ట్ర హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర వీడియో సందేశంలో స్పష్టం చేశారు. పేలుడు వెనుక ఉగ్రవాద సంస్థలు ఉండవచ్చని అనుమానం. అన్ని వివరాలు ఒకటి లేదా రెండు రోజుల్లో బయటకు వస్తాయన్నారు. కరవలి ప్రాంతం చాలా ఏళ్లుగా ఇలాంటి ఘటనలు ఎదుర్కోంటోందన్నారు మంత్రి. ఉగ్ర కోణంలో కూడా దర్యాప్తు ముమ్మరం చేశారని చెప్పారు జ్ఞానేంద్ర.
Also Read : రాజీవ్ హంతకుల విడుదలపై దావా