Terrorist Arrest: బోధన్‌ లో ఉగ్ర అనుమానితుడి అరెస్ట్

బోధన్‌ లో ఉగ్ర అనుమానితుడి అరెస్ట్

Terrorist Arrest : నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో ఉగ్రవాదుల కదలికలు కలకలం సృష్టించాయి. పట్టణంలో ఉగ్రవాది ఉంటున్నట్లు సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు దాడి చేసిన అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాది పట్టణంలోని అనీసనగర్‌‌ కు చెందిన డ్యానిష్ అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అతడి నుంచి ఓ తుపాకీ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. డ్యానిష్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న సమయంలో కీలక విషయాలు బయటపడ్డాయని పోలీసులు వెల్లడించారు.

Terrorist Arrest in Nizamabad District

స్థానిక పోలీసుల సహకారంతో బోధన్ (Bhodan) పట్టణంలో బుధవారం తెల్లవారు జామున విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన ఎన్‌ఐఏ, పటియాలా పోలీసులు.. ఐసిస్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్లు అనుమానిస్తున్న హుజైఫా ఎమన్‌ను అదుపులోకి తీసుకున్నారు. బోధన్ కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం పీటీ వారెంట్‌పై దిల్లీకి తరలించారు.

డ్యానిష్‌కు ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధాలు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఝార్ఖండ్‌‌‌లోని రాంచిలో బాంబు బ్లాస్టింగ్‌‌కు కుట్రలు పన్నుతున్నట్లు పేర్కొన్నారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు బోధన్‌‌లోని పలు చోట్ల తనిఖీలు నిర్వహించామని చెప్పారు. మరింత సమాచారం కోసం అతడిని విచారించాల్సి ఉందని ఢిల్లీ నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. అయితే బోధన్‌లో డ్యానిష్ ఒక్కడే ఉన్నడా..? డ్యానిష్ ఒక్కడే ఉంటే తనకి చేతికి తుపాకీ ఎలా వచ్చింది…? ఝార్ఖండ్‌‌‌లాగానే.. తెలంగాణలో కూడా ఏమైనా బాంబు బ్లాస్టింగ్‌ ప్లాన్ చేశాడా..? రాష్ట్రంలో డ్యానిష్ లాంటి ఉగ్రవాదులు ఇంకా ఉన్నారా..? అనే సందేహాలు ప్రజలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి.

ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా ఎన్‌ఐఏ, దిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఐసిస్‌తో సంబంధాలు కలిగి ఉన్న వారిపై నిఘా ఉంచాయి. ఈ క్రమంలో రాంచీలో అల్లర్లు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్న హషన్‌ డ్యానిష్‌ ను అరెస్ట్ చేశాయి. అతడు ఇచ్చిన సమాచారం మేరకు దేశ వ్యాప్తంగా తనిఖీలు చేపట్టాయి. దిల్లీలో మరో ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో తెలంగాణలోని బోధన్ (Bhodan) పట్టణంలో ఎన్‌ఐఏ అధికారులు జల్లెడ పట్టాయి. పక్కా సమాచారం మేరకు ఉగ్ర మూలాలు కలిగిన వ్యక్తిని అరెస్టు చేశాయి.

ఇన్సాస్‌ రైఫిల్‌ చోరీ కేసులో నేవీ కానిస్టేబుల్‌, అతని సోదరుడు అరెస్ట్‌

ఇన్సాస్ రైఫిల్‌ చోరీ కేసులో నేవీ కానిస్టేబుల్, అతని సోదరుడిని ముంబయి క్రైమ్ బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికల్‌పేటమండలం ఎలకపల్లి గ్రామానికి చెందిన దుబ్బల రాకేశ్‌ 2023లో నేవీలో చేరారు. 2025 ఫిబ్రవరి వరకు ముంబయిలో నేవీ విభాగంలో విధులు నిర్వహించి ఆ తర్వాత కేరళలోని ఎర్నాకుళం బదిలీఅయ్యారు. సెప్టెంబరు 6న రాకేశ్‌ ముంబయిలోని నేవీ కేంద్రానికి వెళ్లి అతని సోదరుడు ఉమేశ్‌ సహకారంతో సెంట్రీ ఏరియాలో ఉన్న ఇన్సాస్‌ రైఫిల్‌, 3 మ్యాగ్జిన్లు, 40 బుల్లెట్లు దొంగిలించారు. అనంతరం స్వగ్రామమైన ఎలకపల్లికి చేరుకున్నారు.

ఈ ఘనటనపై నేవీ అధికారుల ఫిర్యాదు మేరకు ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆధారాలు సేకరించి నిందితులు రాకేశ్‌, ఉమేశ్‌లను ఈ రోజు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి ఇన్సాస్‌ ఆయుధం, 3 మ్యా్గ్జిన్లు, 40 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈకేసులో ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులకు సహకరించిన కాగజ్‌నగర్‌ రూరల్‌ సీఐ కుమారస్వామి, పెంచికల్‌పేట్‌ ఎస్‌ఐ అనిల్‌ కుమార్‌, ఇతర పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌ అభినందించారు.

Also Read : India-Russia: భారత్‌-రష్యా సంయుక్తంగా ‘ఎక్సర్‌సైజ్‌ జాపడ్‌’

Leave A Reply

Your Email Id will not be published!