Terrorist Killed : బారాముల్లాలో ఉగ్ర‌వాది హ‌తం

పోలీసుల ఎన్ కౌంట‌ర్ లో షాక్

Terrorist Killed : జ‌మ్మూ కాశ్మీర్ లోని బారాముల్లాలో జ‌రిగిన ఎన్ కౌంటర్ లో ల‌ష్క‌ర్ ఉగ్ర‌వాది హ‌త‌మ‌య్యాడు. క‌ర్హ‌మా కుంజెర్ ప్రాంతంలో ఉగ్ర‌వాదుల ఉనికి గురించి స‌మాచారం అందుకున్న త‌ర్వాత కార్డ‌న్, సెర్చ్ ఆప‌రేష‌న్ ప్రారంభించారు. ఈ ఘ‌ట‌న శ‌నివారం చోటు చేసుకుంది. భ‌ద్ర‌తా ఎన్ క‌కౌంట‌ర్ చోటు చేసుకున్న అనంత‌రం విస్తృతంగా సెర్చింగ్ చేప‌ట్టారు.

రాజౌరి జిల్లాలో ఇటీవ‌ల ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాలు ఎక్కువ‌య్యాయి. ల‌ష్క‌రే తోయిబా (ఎల్ఈటీ) ఉగ్ర‌వాది హ‌త‌మైన‌ట్లు జ‌మ్మూ కాశ్మీర్ పోలీసు ఉన్న‌తాధికారి వెల్ల‌డించారు. ప్ర‌తీకారం తీర్చుకున్న బ‌ల‌గాల‌పై ఉగ్ర‌వాదులు కాల్పులు(Terrorist Killed) జ‌ర‌ప‌డంతో అది ఎన్ కౌంట‌ర్ గా మారింది. ఇప్ప‌టికే ప‌లు చోట్ల దాడుల‌కు పాల్ప‌డుతున్నాయి ఉగ్ర‌వాద సంస్థ‌లు.

హ‌త‌మైన ఉగ్ర‌వాది కుల్గామ్ లోని యార్ హోల్ బాబోపోరా నివాసి. నిషేధిత ఉగ్ర‌వాద సంస్థ ఎల్ఇటితో సంబంధం ఉన్న అబిద్ వ‌న్ గా గుర్తించ‌బ‌డింది. ఏకే – 47తో పాటు ఇత‌ర మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు జ‌మ్మూ కాశ్మీర్ పోలీసులు. ప్ర‌స్తుతం చోటు చేసుకున్న ఎన్ కౌంట‌ర్ తో ఖాకీలు జ‌ల్లెడ ప‌డుతున్నారు.

జ‌మ్మూ , కాశ్మీర్ లో ఇటీవ‌ల చోటు చేసుకుంటున్న ఘ‌ట‌న‌లు తీవ్ర ఇబ్బందిక‌రంగా మారాయి. ఇప్ప‌టికే దాయాది పాకిస్తాన్ సీమాంత‌ర ఉగ్ర‌వాదాన్ని ప్రోత్స‌హిస్తోంది. దీంతో పాక్ అండ‌తో టెర్ర‌రిస్టులు రెచ్చి పోతున్నారు. దాడుల‌కు పాల్ప‌డుతున్నారు.

Also Read : స్వ‌లింగ సంప‌ర్కం ఓ రుగ్మత – ఆర్ఎస్ఎస్

Leave A Reply

Your Email Id will not be published!