Antony Blinken : ఉగ్రవాదులు దేశాలకు పెను సవాల్
స్పష్టం చేసిన ఆంటోనీ బ్లింకెన్
Antony Blinken : అమెరికా విదేశాంగ శాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉగ్రవాదం పెను ముప్పుగా మారిందన్నారు. ప్రధానంగా ఉగ్రవాదులను గుర్తించే బాధ్యత ఆయా దేశాలపై ఉందన్నారు. ఇందు కోసం పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
ముంబైలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తీవ్రవాద వ్యతిరేక కమిటీ ప్రత్యేక సమావేశానికి ఆంటోనీ బ్లింకెన్ రికార్డు చేసిన సందేశం వినిపించారు. నవంబర్ 2008 నగరంలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో మరణించిన వారిలో ఆరుగురు అమెరికాకు చెందిన పౌరులు కూడా ఉన్నరాని చెప్పారు.
1267 జాబితా అనేది అల్ ఖైదా , ఐసిస్ కి అనుబంధంగా ఉన్న ఉగ్రవాద సంస్థను ఈ సందర్భంగా ఉదహరించారు. ఈ జాబితా కింద టెర్రరిస్టులను గుర్తించే తీర్మానానికి సంబంధిత పార్టీలన్నీ మద్దతు ఇవ్వాలని అమెరికా విదేశాంగ మంత్రి పిలుపునిచ్చారు.
ఆ రోజున ప్రజలను కోల్పోయిన భారత దేశానికి తమ దేశంతో పాటు ఇతర దేశాలు కూడా మద్దతు తెలిపాయని గుర్తు చేశారు బ్లింకెన్(Antony Blinken). సంతాపం చెప్పడం కంటే టెర్రరిస్టులను గుర్తించడంలో కీలక పాత్ర పోషించాలని స్పష్టం చేశారు.
వీరి నిర్వాకం వల్ల ప్రపంచానికి శాంతి అన్నది కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడో ఒక చోట వీరి ప్రభావం కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు.
అంతే కాదు పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతోందన్నారు. ఉగ్రవాదుల ఏరివేత కోసం భారత దేశంతో తాము కలిసి పని చేస్తామన్నారు.
Also Read : రూల్స్ పాటించని అరబిక్ స్కూల్స్