5 Soldiers Killed : ఉగ్రవాదుల దాడిలో జవాన్లు మృతి
ఆర్మీ వాహనంపై కాల్పుల మోత
5 Soldiers Killed : పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. జమ్మూ కాశ్మీర్ లో ఆర్మీ ప్రయాణిస్తున్న వాహనంపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు భారత జవాన్లు ప్రాణాలు(5 Soldiers Killed) కోల్పోయారు. గ్రెనేడ్ లు ఉపయోగించారని సమాచారం. అందు వల్లనే ఆర్మీ వాహనం మంటల్లో చిక్కుకుందని ఆర్మీ వెల్లడించింది గురువారం.
ఈ ఘటన జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరీ సెక్టార్ లోని పూంచ్ లో సైనిక వాహనంపై టెర్రరిస్టులు దాడికి పాల్పడ్డారు. ఐదుగురు జవాన్లు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. భింబర్ గలి ప్రాంతానికి సమీపంలో మధ్యాహ్నం 3 గంటలకు ఉగ్రవాదులు వాహనంపై దాడికి పాల్పడ్డారని ఆర్మీ వెల్లడించింది. ఆర్మీ ప్రధాన కార్యాలయం నార్తర్న్ కమాండ్ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు.
ఈ ప్రాంతంలో భారీ వర్షం వల్ల అదును చూసి మాటు వేశారని తెలిపారు. ఈ ఘటనలో రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ కు చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని , తీవ్రంగా గాయపడిన మరో సైనికుడిని ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. దాడి చేసిన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు ఆర్మీ కమాండ్ చీఫ్. ఈ విషాద సమయంలో తాను ఏమీ మాట్లాడలేక పోతున్నానని పేర్కొన్నారు రాజ్ నాథ్ సింగ్.
Also Read : వింగ్ కమాండర్ కు గ్యాలంట్రీ అవార్డు