TS TET 2022 : తెలంగాణ‌లో టెట్ ప‌రీక్ష ప్రారంభం

రాష్ట్ర వ్యాప్తంగా అభ్య‌ర్థులు హాజ‌రు

TS TET 2022 : ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష ( టెట్ )(TS TET 2022) కోసం తెలంగాణ‌లో ఎక్క‌డా లేనంత పోటీ నెల‌కొంది. ఈసారి డీఎడ్ కు కూడా బీఇడి చేసిన అభ్య‌ర్థులు అర్హులేనంటూ ప్ర‌క‌టించ‌డంతో పెద్ద ఎత్తున ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

ఇక ఒకసారి పాసైతే చాలు జీవిత కాలం వ‌ర్తిస్తుంద‌ని స‌ర్కార్ స్ప‌ష్టం చేసింది. దాంతో ద‌ర‌ఖాస్తులు వెల్లువ‌లా వ‌చ్చి ప‌డ్డాయి. ఈ మేర‌కు రాష్ట్ర వ్యాప్తంగా 2, 683 కేంద్రాల‌లో టెట్ ప‌రీక్ష(TS TET 2022) ప్రారంభ‌మైంది.

పేప‌ర్ -1 ఉద‌యం 9. 30 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల దాకా కొన‌సాగ‌నుండ‌గా పేప‌ర్ -2 మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల నుంచి 5 గంట‌ల దాకా జ‌రుగుతుంది. ఒక్క గ్రేట‌ర్ హైద‌రాబాద్ లోనే 336 ఎగ్జామ్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేశారు.

83 వేల‌కు పైగా హాజ‌రయ్యారు. ములుగు జిల్లాలో కేవ‌లం 15 కేంద్రాలు మాత్ర‌మే నిర్వ‌హిస్తున్నారు. ఇక్క‌డ 2 వేల‌కు పైగా మాత్ర‌మే ప‌రీక్ష రాస్తున్నారు.

ఈసారి టీచ‌ర్లు, లెక్చ‌రర్ల‌తో పాటు ఇత‌ర శాఖ‌ల సిబ్బందిని ఇన్విజిలేట‌ర్లుగా నియ‌మించారు. ప్ర‌తి కేంద్రంలో 11 మంది ఇన్విజిలేట‌ర్లు, ముగ్గురు అబ్జ‌ర్వ‌ర్ ల‌ను ఏర్పాటు చేశారు.

ఈ మొత్తం ప్ర‌క్రియ అంతా ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో కొన‌సాగుతోంది. ప్ర‌తి చోట సీసీ కెమెరాలు ఉన్నాయి. మొత్తం వీడియో రికార్డింగ్ చేస్తున్నారు.

అభ్య‌ర్థుల కోసం ముందుగానే ఆర్టీసీ బ‌స్సులు ఎక్కువ‌గా న‌డుపుతోంది. ఇదిలా ఉండ‌గా చాలా మంది అభ్య‌ర్థుల వివ‌రాలలో త‌ప్పులు దొర్లాయి.

విచిత్రం ఏమిటంటే తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత మొద‌టిసారి ఈ టెట్ ప‌రీక్ష నిర్వ‌హిస్తుండ‌డం. అంత‌కు ముందు ఉమ్మ‌డి ఏపీలో ప‌రీక్ష చేప‌ట్టారు. ఉద్యోగాల భ‌ర్తీ కూడా కొన‌సాగింది. కానీ ఈ ప్ర‌భుత్వం వ‌చ్చాక కొలువుల ఊసే లేకుండా పోయింది.

Also Read : 1,433 పోస్టుల‌కు ఆర్థిక శాఖ క్లియ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!