TG Govt : మహిళలకు శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్
ఇప్పుడు, మహిళా సాధికారిత దిశగా కూడా అడుగులు వేస్తున్నారు...
TG Govt : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన పాలనలో ఒక కొత్త మార్గాన్ని అవలంబిస్తూ, అనేక మార్పులను తీసుకురావడం కొనసాగిస్తున్నారు. ఇటీవల, ట్రాన్స్‌జెండర్స్‌కు పోలీసు శాఖలో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా పనిచేసే అవకాశం ఇచ్చి, వారికి గౌరవప్రదమైన జీవితాన్ని కల్పించాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు, మహిళా సాధికారిత దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. ఆర్థికంగా స్వతంత్రంగా జీవించే అవకాశం కల్పించేందుకు రకరకాల పథకాలను అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్, తాజాగా ఒక కొత్త పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
TG Govt Updates
ఈ కొత్త పథకం ద్వారా, మహిళలందరికీ ఉపాధి కల్పించి, వారు స్వయంగా తమ కాళ్ల మీద నిలబడేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా, తెలంగాణ(Telangana) మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ “ఇందిరమ్మ మహిళా శక్తి స్కీమ్”ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ కింద, మైనారిటీ వర్గాలకు చెందిన అర్హత గల మహిళలకు కుట్టు మిషన్లు ఉచితంగా అందించబడతాయి. అర్హులైన మహిళలు నేరుగా https://tgobmms.cgg.gov.in వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫారమ్‌లో పేరు, రేషన్ కార్డు వివరాలు, వార్షిక ఆదాయం, ఆధార్ నంబర్, పెళ్లి వివరాలు, మొబైల్ నంబర్, మతం, టైలరింగ్ శిక్షణ వివరాలు, విద్యా అర్హత మరియు ఇతర అవసరమైన సమాచారాన్ని భర్తీ చేయాలి. అప్లికేషన్‌లో అడ్రెస్ వివరాలను కూడా పూర్తి చేసి, సంబంధిత సర్టిఫికెట్లను జత చేయాలి. ఈ పథకం, ముస్లింలు, సిక్కులు, పార్సీలు, బౌద్ధులు, జైనులు వంటి మైనారిటీ మహిళలకు వర్తిస్తుంది.
Also Read : Vijayasai Reddy Resign : రాజీనామా లేఖ ఇచ్చిన ఎంపీ..ఆమోదించిన రాజ్యసభ చైర్మన్