TG Govt : తెలంగాణ రైతన్నలకు రేవంత్ సర్కార్ శుభవార్త
గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్-2024 బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది...
TG Govt : రైతులకు రేవంత్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) ప్రకటించారు. ప్రభుత్వ ప్రకటనపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ వేదికగా మంత్రి తుమ్మల రైతు భరోసాపై ఈ కీలక ప్రకటన చేశారు. రైతు భరోసాపై ప్రభుత్వం సబ్‌కమిటీ ఏర్పాటు చేసిందని తెలిపారు. రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించామని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతు భరోసా కింద రైతులకు రూ.80 వేల కోట్లు ఇచ్చిందని అన్నారు. గతంలో సాగుచేయని భూములకు కూడా రైతుబంధు ఇచ్చారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుర్తుచేశారు.
TG Govt….
ఏడో రోజు తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు ఇవాళ(శనివారం) ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్-2024 బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అలాగే సభ ముందుకు తెలంగాణ మున్సిపాలిటీల 2024 బిల్లు, తెలంగాణ పంచాయతీరాజ్ బిల్లు 2024ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. తెలంగాణ భూ భారతి బిల్లును మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. రైతు భరోసాపై మండలిలో స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. రైతుబంధుపై సమగ్ర చర్చ జరగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. రైతు భరోసాను ప్రారంభించింది తామేనని స్పష్టం చేశారు. రైతుబంధుతోనే సాగు విస్తీర్ణం పెరిగిందని గుర్తుచేశారు. రైతుబంధుపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి చెప్పాలని అన్నారు. రైతుబంధు ఒక పంటకు ఇస్తారో లేక..రెండు పంటలకు ఇస్తారో ప్రభుత్వం చెప్పాలని కేటీఆర్(KTR) డిమాండ్ చేశారు.
శాసనసభపది నిమిషాల ఆలస్యంగా ప్రారంభం కావటంపై మాజీ మంత్రి హారీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. 10గంలకు ప్రారంభంకావాల్సిన సభ.. 10.10గంకు ఎందుకు ప్రారంభం అయిందని ప్రశ్నించారు. సభను సమయానికి ఎందుకు నడపడం లేదని హరీష్‌రావు నిలదీశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పదేళ్లు సభను సమయానికి నడిపామని హరీష్‌రావు గుర్తుచేశారు. చట్టాలు చేసే మనం ఆదర్శంగా ఉండాలని హరీష్‌రావు చెప్పారు. సభను సమయానికి ప్రారంభించాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు విజ్ఞప్తి చేశారు. హరీష్ రావును ఉద్దేశించి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ మాట్లాడారు. సభ ఎప్పుడు పెద్దగా ఆలస్యం కాలేదని చెప్పారు. ఈరోజు జీరో వరకు తీసుకోవాలనే అంశం మీద చర్చ జరిగిందని అన్నారు. అందుకే సభ ప్రారంభానికి కొద్దిగా ఆలస్యమైందని చెప్పారు. అయితే హరీష్‌రావు వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. ఏదో ఒక సాకుతో సభ సరిగా జగరడం లేదని చెప్పాలని బీఆర్ఎస్ భావిస్తోందని ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఇప్పటి వరకు సభకు రాకుండా సభ గౌరవాన్ని తగ్గించాలని చూస్తున్నారని ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు.
Also Read : AP Rains : ఏపీలో ఆయా ప్రాంతాల వారిని వీడని వానలు