Chikoti Praveen Arrest : థాయిలాండ్లో చీకోటి ప్రవీణ్ అరెస్ట్
రూ. 20 కోట్ల నగదు స్వాధీనం
Chikoti Praveen Arrest : క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ మరోసారి హాట్ టాపిక్ గా మారాడు. హైదరాబాద్ కు చెందిన ప్రవీణ్ థాయ్ లాండ్ లో అరెస్ట్ అయ్యాడు. పటాయాలో 93 మంది కలిగిన ముఠాను థాయిలాండ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో చీకోటి ప్రవీణ్ కూడా ఉన్నారు. వీరిలో మహిళలు కూడా ఉండడం విశేషం. వీరి నుంచి పెద్ద ఎత్తున నగదు, గేమింగ్ కు సంబంధించిన చిప్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
సోమవారం థాయ్ లాండ్ పోలీసులకు పటాయా లోని ఓ లగ్జరీ హోటల్ లో గ్యాంబ్లింగ్ జరుగుతోందంటూ సమాచారం వచ్చింది. దీనిని ఆధారంగా చేసుకుని టాస్క్ ఫోర్స్ సిబ్బంది మూకుమ్మడిగా దాడికి దిగారు. ఈ ఘటనలో 93 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 80 మందికి పైగా భారతీయులే ఉండడం విశేషం. నిందితుల నుంచి రూ. 20 కోట్ల నగదు, కెమెరాలు, 92 ఫోన్స్ , మూడు నోట్ బుక్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు టాక్.
ఇదిలా ఉండగా గత నెల ఏప్రిల్ 27 నుంచి మే 1 దాకా హోటల్ బుక్ చేసుకున్నారని పోలీసులు తెలిపారు. ప్రత్యేకించి క్యాసినో కోసం సంపావో రూమ్ ను రెంట్ కు తీసుకున్నట్లు వెల్లడించారు. తాము సోదాలు చేపట్టేందుకు వెళ్లగా పారి పోయేందుకు ప్రయత్నం చేశారని కానీ చాకచక్యంగా పట్టుకున్నట్లు చెప్పారు థాయ్ లాండ్ పోలీసులు. క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ అరెస్ట్(Chikoti Praveen Arrest) తో ఒక్కసారిగా కలకలం రేగింది ఇరు తెలుగు రాష్ట్రాలలో.
Also Read : హామీలు అనేకం చర్యలు శూన్యం