UGC : ఆ యూనివర్శిటీకి గుర్తింపు లేదు – యూజీసీ
జారీ చేసే సర్టిఫికెట్లు చెల్లవు
UGC : దేశంలో పుట్ట గొడుగుల్లా యూనివర్శిటీల పేర్లు వెల్లువలా వస్తున్నాయి. ఏది నిజమో ఏది నకిలినో తెలియక విద్యార్థులు నానా తంటాలు పడుతున్నారు.
ఇందుకు సంబంధించి దేశ వ్యాప్తంగా యూనివర్శిటీలపై ఆజమాయిషీ చెలాయిస్తూ వస్తున్న యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది.
కొన్ని ప్రైవేట్ యూనివర్శిటీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఢిల్లీ లోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్ ( ఏఐఐపీహెచ్ఎస్) పేరుతో ఓ యూనివర్శిటీ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.
భారీ ఎత్తున ప్రచారం కూడా చేస్తోంది. దీనిని గమనించిన యూజీసీ(UGC) విద్యార్థులకు హెచ్చరికలు జారీ చేసింది. ఇది ఫేక్ యూనివర్శిటీ అని, ఇందులో చేరవద్దని హెచ్చరించింది.
దీనికి యూజీసీ ఎలాంటి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఎవరైనా విద్యార్థులు ఏదేని యూనివర్శిటీలో చేరాలని అనుకుంటే ఆయా యూనివర్శిటీలు ప్రభుత్వ పరిధిలో అంటే యూజీసీ పరిధిలో ఉన్నాయో లేవోనని సరి చూసుకోవాలని వెల్లడించింది.
ఇందుకు సంబంధించి యూజీసీ వెబ్ సైట్ లో అన్ని వివరాలు పొందు పర్చడం జరిగిందని తెలిపింది. ఒకవేళ ఇందులో చేరితే గనుక వెంటనే విరమించు కోవాలని, డబ్బులు కట్టినట్లయితే తిరిగి తీసుకోవాలని అప్రమత్తం చేసింది.
ఈనెల 27న ఈ మేరకు యూజీసీ నోటీసులు కూడా జారీ చేసింది. యూజీసీ యాక్ట్ , 1956ని ఉల్లంఘించేలా వివిధ డిగ్రీ కోర్సులను జారీ చేస్తోందని తమ దృష్టికి వచ్చిందని తెలిపింది.
ఏఐఐపీహెచ్ఎస్ ను యూజీసీ నకిలీ యూనివర్శిటీగా ప్రకటించింది.
Also Read : సమస్తం అర చేతిలో ప్రత్యక్షం