Thatikonda Rajaiah: మళ్లీ బీఆర్ఎస్లోకి తాటికొండ రాజయ్య ! కడియంకు చెక్ పెట్టేందుకేనా !
మళ్లీ బీఆర్ఎస్లోకి తాటికొండ రాజయ్య ! కడియంకు చెక్ పెట్టేందుకేనా !
Thatikonda Rajaiah: లోక్ సభ ఎన్నికల ముంగిట తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. లోక్ సభ సీటు కోసం చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీలను మార్చుతున్నారు. పదేళ్ళ పాటు అధికారం అనుభవించిన కొంతమంది బీఆర్ఎన్ నాయకులు… లోక్ సభ టిక్కెట్టు కేటాయించిన తరువాత కూడా పార్టీను వీడుతున్నారు. ఇటీవల బీఆర్ఎస్ అధిష్టానం వరంగల్ ఎంపీ అభ్యర్ధిగా కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యను ప్రకటించారు. అయితే లోక్ సభ సీటు ప్రకటించిన తరువాత కాళేశ్వరం అవినీతి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సాకుగా చూపి ఆమె లోక్ సభ ఎన్నికల బరినుండి తప్పుకుంటున్నట్లు పార్టీ అధిష్టానానికి లేఖ రాసారు. అయితే కడియం శ్రీహరితో కాంగ్రెస్ నేతలతో భేటీ కావడం తెలంగాణా రాజకీయాలు ఆశక్తికరంగా మారాయి. కుమార్తె కావ్యతో పాటు శ్రీహరి కాంగ్రెస్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ తరపున వరంగల్ ఎంపీగా కడియం శ్రీహరి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
Thatikonda Rajaiah Joined in BRS
ఈ నేపథ్యంలో కడియం శ్రీహరి స్థానాన్ని భర్తీ చేసేందుకు బీఆర్ఎస్ అధిష్టానం జోరుగా పావులు కదుపుతోంది. ఇటీవల పార్టీను వీడిన బీఆర్ఎస్ సీనియర్ నేత, స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యను(Thatikonda Rajaiah) తిరిగి పార్టీలోనికి బీఆర్ఎస్ నేతలు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. స్టేషన్ ఘన్ పూర్ సీటు దక్కకపోవడంతో బీఆర్ఎస్ పార్టీకు రాజీనామా చేసిన కాంగ్రెస్ లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. అదే సమయంలో రాజయ్య రాజీనామాను కేసీఆర్ ఆమోదించలేదు. దీనితో స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తిరిగి బీఆర్ఎస్ లోనికి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీకి చేసిన రాజీనామాను ఉపసంహరించుకోబోతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే రాజయ్యతో హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ నేతలు టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం రాజయ్య నేరుగా కేసీఆర్ తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కడియం శ్రీహరి వరంగల్ నుంచి ఎంపీగా పోటీ చేస్తే… ఆయన మీద పోటీగా రాజయ్యను బరిలోకి దింపేందుకు బీఆర్ఎస్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
Also Read : Thummala Nageswara Rao: రుణమాఫీ విధివిధానాలు రూపొందిస్తున్న తెలంగాణా ప్రభుత్వం !