Guneet Monga : నేనింకా న‌మ్మ‌లేక పోతున్నా – మోంగా

ది ఎలిఫెంట్ విస్ప‌ర‌ర్స్ ఫిలిం నిర్మాత

Guneet Monga : ప్ర‌పంచమంతా ఎదురు చూసిన ఆస్కార్ అవార్డుల వేడుకలో అరుదైన దృశ్యం ఆవిష్కృత‌మైంది. భార‌త దేశానికి సంబంధించి రెండు ఆస్కార్ పుర‌స్కారాలు ద‌క్కాయి. తొలుత ది ఎలిఫెంట్ విష్ప‌ర‌ర్స్ కు ద‌క్క‌గా రెండోది ఎస్ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ కు బెస్ట్ ఒరిజ‌న‌ల్ పాట కేట‌గిరీలో ఆస్కార్ అవార్డు ల‌భించింది.

ఈ సంద‌ర్భంగా ఆస్కార్ అవార్డును అందుకున్నారు ది ఎలిఫెంట్ విస్ప‌ర‌ర్స్ నిర్మాత గునీత్ మోంగా(Guneet Monga). ఇది దేశీయ దంప‌తులైన బొమ్మ‌న్ , బెల్లి సంర‌క్ష‌ణ‌లో ర‌ఘు అనే అనాథ ఏనుగు పిల్ల క‌థ‌. అత్యంత హృద్యంగా తెర‌పై చిత్రీక‌రించారు డైరెక్ట‌ర్. ది ఎలిఫెంట్ విస్ప‌ర‌ర్స్ డిసెంబ‌ర్ 2022లో నెట్ ఫ్లిక్స్ లో విడుద‌లైంది.

లాస్ ఏంజిల్స్ లో జ‌రిగిన 95వ అకాడ‌మీ అవార్డుల‌లో ది ఎలిఫెంట్ విస్ప‌ర‌ర్స్ ఉత్త‌మ డాక్యుమెంట‌రీ షార్ట్ స‌బ్జెక్ట్ గా నిలిచింది. షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ గెలుచుకున్న మొద‌టి భార‌తీయ చిత్రం. 1969 , 1979లో ఉత్త‌మ డాక్యుమెంట‌రీ షార్ట్ గా పోటీ ప‌డిన ది హౌస్ ద‌ట్ ఆనంద్ బిల్ట్ , యాన్ ఎన్ కౌంట‌ర్ విత్ ఫేసెస్ త‌ర్వాత నామినేట్ అయిన మూడోది. ఈ చిత్రానికి క‌రికి గోన్సాల్వేస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. గునీత్ మోంగా నిర్మించారు.

ఈ సంద‌ర్బంగా నిర్మాత గునీత్ మోంగా స్పందించారు. త‌న ఆనందాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నారు. ఇద్ద‌రు మ‌హిళ‌లు సాధించిన విజ‌యం ఇది అని పేర్కొన్నారు.

Also Read : విశ్వ వేదిక‌పై నాటు నాటు అదుర్స్

Leave A Reply

Your Email Id will not be published!